Viral News: విద్యుత్‌ వైర్ల మధ్యలో చిక్కుకున్న పావురం.. పోలీసులు దానిని కాపాడిన విధానం చూస్తే షాక్ అవుతారు..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 14, 2021 | 10:36 AM

Viral News: ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని..

Viral News: విద్యుత్‌ వైర్ల మధ్యలో చిక్కుకున్న పావురం.. పోలీసులు దానిని కాపాడిన విధానం చూస్తే షాక్ అవుతారు..!
Pigeon

Viral News: ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్‌ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్‌ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్‌ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది. ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్‌ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్‌ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also read:

Trailer Talk: మారుతి మార్క్‌ కామెడీతో ‘మంచి రోజులు వచ్చాయి’.. ట్రైలర్‌ ఎలా ఉందో చూశారా.?

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Digital India Corporation: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu