Viral News: ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో నవజాత శిశువు జననం.. ఏం పేరు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..!
Viral News: ఆధునిక కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లు ఎంతో ప్రత్యేకంగా ఉండాని వినూత్నంగా ఆలోచించి రకరకాల పేర్లు పెడుతుండటం మనం చూశాం.
Viral News: ఆధునిక కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లు ఎంతో ప్రత్యేకంగా ఉండాని వినూత్నంగా ఆలోచించి రకరకాల పేర్లు పెడుతుండటం మనం చూశాం. కానీ ఇక్కడ ఒక జంట తమకు అప్పడే పుట్టిన బిడ్డకు అత్యంత ఆశ్చర్యకరమైన పేరు పెట్టారు. అదేంటో, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఇక అసలు విషయానికి వెళదాం.. పాకిస్తాన్‌కు చెందిన దంపతులు మరో 97 మంది పాకిస్తానీలతో సహా 71 రోజులగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. సరిహద్దుల్లో చిక్కుకున్న వారిలో నిండు గర్భిణి అయిన మహిళ కూడా ఉంది. ఈ క్రమంలో డిసెంబరు 2న గర్భవతి అయిన మహిళకు భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ప్రసవించింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ బిడ్డ భారత్-పాక్ సరిహద్దుల్లో పుట్టిన నేపథ్యంలో చిన్నారికి ‘బోర్డర్’ అని పేరు పెట్టారు ఆ తల్లిదండ్రులు. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి వెల్లడించాడు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన ఆ జంట నింబుబాయి, బాలం రామ్‌లు పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో ఉన్నారు. తన భార్య ప్రసవ సమయంలో సహాయం చేసేందుకు పక్కనే ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు వచ్చారని, వైద్య సదుపాయాలను సైతం ఏర్పాటు చేశారని బాలం రామ్ తెలిపాడు.
కాగా లాక్‌డౌన్‌కు ముందు తమ బంధువులను కలిసేందుకు భారత్‌కు వచ్చిన బాలం రామ్ దంపతులు తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులు సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయినట్లు బాలంరామ్ తెలిపాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అక్కడి స్థానికులే తమకు ఆహారం, మందులు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపాడు. ఏదేమైనా.. చిన్నారికి ‘బోర్డర్’ అని పెట్టడటం అందరికీ ఆకట్టుకుంటుంది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాండ్స్ వస్తోంది. చిన్నారి సహా తల్లి క్షేమంగా ఉండాలని నెటిజన్లు ఆశిస్సులు అందిస్తున్నారు.
Also read:
Zoom Call: సర్‌ప్రైజ్ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్!