105 Years Old Olympic Record: బాప్ రే బామ్మ దంచేసిందిగా.. వందేళ్ల వయస్సులో ఒలింపిక్స్ రికార్డ్ బ్రేక్ చేసేసింది..!

105 Years Old Olympic Record: సాధారణంగా 60 ఏళ్లు దాటగానే తమ పని అయిపోయింది అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ ఓ బామ్మ అలా అనుకోలేదు.

105 Years Old Olympic Record: బాప్ రే బామ్మ దంచేసిందిగా.. వందేళ్ల వయస్సులో ఒలింపిక్స్ రికార్డ్ బ్రేక్ చేసేసింది..!
Usa Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 07, 2021 | 8:50 AM

105 Years Old Olympic Record: సాధారణంగా 60 ఏళ్లు దాటగానే తమ పని అయిపోయింది అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ ఓ బామ్మ అలా అనుకోలేదు. ఏజ్‌ కేవలం ఒక నెంబర్‌ మాత్రమే అంటుంది. జీవితంలో ఏదైనా సాధించడానికి ఏజ్‌తో పనిలేదంటోంది. అనడమేంటి.. సాధించి చూపించింది. వందేళ్లు పైబడిన వాళ్లకు నిర్వహించిన 100 మీటర్ల రన్నింగ్‌ రేసులో రికార్డ్‌ బద్దలు కొట్టి సూపర్‌ బామ్మ అనిపించుకుంది.

వివరాల్లోకెళితే.. ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి నిర్వహించిన ‘‘లూసియానా సీనియర్‌ గేమ్స్‌’’ లో ఒలింపిక్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టింది జాలియా హాకిన్స్‌. 100 మీటర్ల రేసును కేవలం 62 సెకన్లలో ముగించి రికార్డ్‌ సృష్టించింది. ఈ వంద మీటర్లు రేసులో పాల్గొన్న ఈ బామ్మ వయసు వందపైనే. రన్నింగ్‌ ట్రాక్‌పైన జూలియా దూకుడు చూసి జనాలు బిత్తరపోయారు. అమెను ముద్దుగా ‘‘హరికేన్‌’’ అని పిలుచుకుంటున్నారు. కాగా జూలియా కన్నా ముందు 100 నుంచి 104 ఏళ్ల వయసు వారికి నిర్వహించిన ‘మిషిగాన్‌ సీనియర్‌ ఒలింపిక్స్’ రేసులో 101 సవత్సరాల ఫ్రీడ్‌మాన్‌ 89 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పింది. ఈమెకు ఫ్లాష్‌ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు అభిమానులు.

అయితే జూలియా రికార్డులేమీ తక్కువ కాదు. 2019లో 50 మీటర్ల రేసును 46.07 సెకెన్లలో పూర్తి చేసిన మొదటి వందేళ్ల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022లో ఫ్లోరిడాలో జరగనున్న నేషనల్‌ సీనియర్‌ గేమ్స్‌లో జూలియా హాకిన్స్, డయానే ఫ్రీడ్‌మాన్‌ ఒకేసారి రేసులో తలపడబోతున్నారు. హరికేన్‌ వర్సెస్‌ ఫ్లాష్‌ రేసును తిలకించడానికి ఫ్లోరిడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also read:

Omicron: ‘సూపర్ మైల్ట్‌’ వేరియంట్‌గా ఒమిక్రాన్.. టార్గెట్‌గా మారిన యువత.. పొంచి ఉన్న భారీ ముప్పు.. నిపుణులు ఏమంటున్నారంటే?

Putin in India: భారత రష్యా సంబంధాలకు బూస్టర్ డోస్ ఇచ్చిన పుతిన్ పర్యటన.. వాణిజ్య బంధాలపై పలు ఒప్పందాలు!

Zoom Call: సర్‌ప్రైజ్‌ ఇస్తాడనుకుంటే.. షాకిచ్చాడు.. మూడు నిమిషాల్లో 900 మంది ఔట్‌!