AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పహల్గామ్‌లో మళ్లీ పర్యాటకుల సందడి.. ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసిన సీఎం..

మిని స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గాంలో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. జమ్మూకాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని బలిగొన్నారు. ఈ సంఘటన కశ్మీర్‌తో పాటు యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ ఘటనతో కొన్ని రోజులపాటు అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో

పహల్గామ్‌లో మళ్లీ పర్యాటకుల సందడి.. ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసిన సీఎం..
Pahalgam Tourism
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2025 | 10:06 AM

Share

జమ్మూకాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉగ్రదాడి తర్వాత పహల్గామ్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌ వ్యాలీ టూరిస్ట్‌లతో కళకళలాడుతోంది. రోడ్ల మీద పర్యాటకుల వాహనాలు బారులుతీరాయి. టూరిస్టులతో రద్దీగా ఉన్న పహల్గామ్ పరిసరాలను చూసి సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే ఆయన రెండోసారి పహల్గామ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా పర్యాటకులతో రద్దీగా ఉన్న అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మిని స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గాంలో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. జమ్మూకాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని బలిగొన్నారు. ఈ సంఘటన కశ్మీర్‌తో పాటు యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ ఘటనతో కొన్ని రోజులపాటు అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అక్కడ అందమైన ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి వ్యాలీని చుట్టేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటళ్లు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే