Viral Photo: ఈ ఫోటో మిమ్మల్ని భయపెడుతుంది.. బ్లాక్ హోల్ మీ వైపే దూసుకువస్తుంది..
అనేక రకాల ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మేము మీ కోసం ఇల్యూజన్ ఫోటోను తీసుకువచ్చాము. దీన్ని చూసిన వెంటనే మీరు గందరగోళానికి గురవుతారు.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. మనం చూస్తోంది నిజమేనా..? కాదా అన్న అనుమానాన్ని కలిగేలా చేస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఫోటోలు ఎక్కువగా న్యూస్ పేపర్స్‌లో కనిపించేవి. ఫలానా ఫోటోను తీక్షణంగా చూస్తే ఒక జంతువు కనిపిస్తుంది. గుర్తించండి అంటూ ఫోటోలు వచ్చేవి. ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు కూడా సోషల్ మీడియా(Social Media)లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంటికి, మెదడుకు మేత పెట్టేలా ఉండే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ మారాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఫలానా జంతువను, పక్షిని కనిపెట్టడం రకం. అలా కాకుండా ఆ ఫోటోను చూడగానే మొదట ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని కూడా చెప్పే ఫోటోలు కూడా ఇటీవల చూస్తున్నాం. కాగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్ మిమ్మల్ని తికమకపెడతాయి. మీ బ్రెయిన్‌కు టెస్ట్ పెడతాయి. మీ ఐ పవర్ ఏ లెవల్లో ఉందో చెప్పేస్తాయి. మీ మనస్తత్వాన్ని చెప్పేస్తాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో మిమ్మల్ని భయపెడుతుంది. ఫోటోను అదే పనిగా గమనిస్తే బ్లాక్ హోల్ మీ వైపు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మీ మనస్సును చీకటి వైపుకు తీసుకెళ్లే భయంకరమైన భ్రమ. వెలుతురు లేని ప్రదేశంలోకి ప్రవేశించినట్లుగా, చీకటి వైపు వెళ్లే అనుభూతిని ఇది ప్రజలకు కలిగిస్తుంది. అదే మరి ఆప్టికల్ ఇల్యూజన్‌కు ఉన్న పవర్.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..