Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని చెప్పగలరా.. 99% మంది ఫెయిల్‌..?

Viral: మీరు ఆప్టికల్ ఇల్యూషన్ పేరు వినే ఉంటారు. దీని చరిత్ర చాలా పాతది. ఇందులో కనిపించేది ఒకటి ఉంటే కనిపించనిది మరొకటి ఉంటుంది. ఇది మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో తెలియజేస్తుంది.

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని చెప్పగలరా.. 99% మంది ఫెయిల్‌..?
Optical
Follow us

|

Updated on: Feb 20, 2022 | 9:13 AM

Viral: మీరు ఆప్టికల్ ఇల్యూషన్ పేరు వినే ఉంటారు. దీని చరిత్ర చాలా పాతది. ఇందులో కంటికి కనిపించేది ఒకటి ఉంటే కనిపించనిది మరొకటి ఉంటుంది. ఇది మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో తెలియజేస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ మిస్టరీని ఛేదించడం అంత సులువైన పనికాదు. దీని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ ఫొటోని ఎక్కువ సార్లు గమనిస్తే తప్పించి మీరు ఆ సంఖ్యని తెలుసుకోలేరు. ఇప్ప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీ కంటిచూఎంత  మెరుగ్గా ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు.

వాస్తవానికి ఈ చిత్రంలో కొన్ని సంఖ్యలు దాగి ఉన్నాయి. ఆ సంఖ్యలు ఏంటో చెప్పడం కొంచెం కష్టమైన పనే. ఈ చిత్రంలో కొన్ని సంఖ్యలు ఒక సర్కిల్‌ ప్రకారం రాశారు. అయితే ఆ సంఖ్యని చాలా కొద్ది మంది మాత్రమే చెప్పగలిగారు. ఎక్కువ మంది తప్పు నెంబర్ చెప్పారు. ఈ చిత్రాన్ని @benonwine ID పేరుతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. మీకు ఇందులో ఏదైనా నంబర్ కనిపిస్తుందా అని అడిగారు. కనిపిస్తే ఆ సంఖ్య ఏంటో చెప్పండని ప్రశ్నించారు. ఈ వైరల్ చిత్రం ఇప్పటివరకు 1,600 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. రెండు వందల యాభై మందికి పైగా చిత్రాన్ని రీట్వీట్ చేశారు.

నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సర్కిల్‌లో దాచిన నంబర్‌ను చెప్పడానికి ప్రయత్నించారు. ఒక నెటిజన్ 3452839 అని చెప్పారు. మరొకరు 528 అన్నారు. ఇంకొకరు 45283 నంబర్‌ని చెప్పారు. ఒకతను మాత్రం ‘నేను 45283 సంఖ్యను చూడగలుగుతున్నాను, కానీ సర్కిల్‌లో మరో రెండు సంఖ్యలను కూడా చూస్తున్నాను,  వాటిని కనుక్కోలేకపోతున్నాను’ అన్నాడు. అసలు వాస్తవానికి ఆ ఫొటోలో ఉన్న నెంబర్ 3452839. అయితే ఈ సంఖ్యని ఇద్దరు, ముగ్గురు తప్పించి ఎవరు చెప్పలేకపోయారు. మీరు ఈ ఫొటోని చూసినట్లయితే  కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

ఈ ఒక్క ఆకు మధుమేహం, క్యాన్సర్లకి దివ్య ఔషధం.. వీటితో పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..?

Burqa: బురఖా వెనుక కన్నీటి గాథ.. మొదట భర్త.. తర్వాత మామ.. సహించలేని దారుణాలు

Aadhaar Card: ఆధార్ కార్డ్‌లో ఫొటో తప్పు పడిందా.. ఆన్‌లైన్‌లో మార్చలేరు.. ఇలా చేయాల్సిందే..?