Optical Illusion: హలో బాస్.. ఈ ఫొటోలో జంతువును 10 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే..

సోషల్ మీడియా ప్రపంచం.. ఎన్నో వింతలకు ప్రసిద్ధి.. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ఇవి నెటిజన్లకు సవాల్ విసురుతూ.. గజిబిజి చేస్తుంటాయి.

Optical Illusion: హలో బాస్.. ఈ ఫొటోలో జంతువును 10 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే..
Optical Illusion

Updated on: Apr 13, 2023 | 5:04 PM

సోషల్ మీడియా ప్రపంచం.. ఎన్నో వింతలకు ప్రసిద్ధి.. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ఇవి నెటిజన్లకు సవాల్ విసురుతూ.. గజిబిజి చేస్తుంటాయి. అయితే, ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూ.. మన కళ్లను మోసం చేసేలా కనిపిస్తుంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలలో దాగి ఉన్న వాటిని పరిష్కరించడం చాలా మందికి సాధ్యం కాకపోవచ్చు. అయితే, తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో ఉన్న విషయాలను గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్ గా ఉన్నట్లు అర్ధం. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్‌‌ను తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంతువు దాగి ఉంది.

పర్పుల్ డిజైన్‌లో సమాంతర రేఖల మధ్య ఓ జంతువు దాగి ఉంది. కేవలం రూపురేఖలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ లైన్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్నందున కొంతమందికి ఇది హిప్నోటిక్ ప్రభావాన్ని కలిగిస్తుంది. అయితే, ఈ లైన్స్ మధ్య చూపును ఫోకస్ చేస్తే.. కచ్చితంగా ఓ జంతువు కనిపిస్తుంది. మీరు చూడాలని ప్రయత్నిస్తున్న జంతువును ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’గా పిలుస్తుంటారు.

ఇప్పటికీ దాన్ని గుర్తించలేదా?

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోలో దాగిన ఉన్న జంతువు పేరు సింహం. సింహం వ్యక్తిత్వం ఉన్నవారు గొప్ప కమ్యూనికేటర్లుగా ఉంటారు. కాబట్టి తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ముందుంటారు. ఈ వ్యక్తులు అన్ని విషయాలపై బాగా ఫోకస్ చేస్తుంటారు. అందుకే వీరికి జనాదరణ ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..