Old Coin Auction: ధ్యావుడా.. ఒక్క రూపాయి నాణాన్ని 10 కోట్లు పెట్టి కొన్నారు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..

| Edited By: Anil kumar poka

Sep 19, 2021 | 7:26 PM

Old Coins: ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ముఖ్యంగా పాత వస్తువులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ప్రపంచంలో..

Old Coin Auction: ధ్యావుడా.. ఒక్క రూపాయి నాణాన్ని 10 కోట్లు పెట్టి కొన్నారు.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..
One Ruppe Coin
Follow us on

Old Coins: ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ముఖ్యంగా పాత వస్తువులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీరు పాత నాణేలు, నోట్లు, స్టాంప్‌లను సేకరిస్తుంటారు. అయితే, పాత నాణేలె, పాత వస్తువులకు సంబంధించి మనం తరచుగా వార్తలు చూస్తూనే ఉంటాం. అలాంటి షాకింగ్ వార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క రూపాయి నాణెం ఏకంగా.. రూ. 10 కోట్లు పలికింది. అవును ఇది నిజంగా నిజమే. ఈ నాణెం ఇంత ఎక్కువ ధర పలకడానికి కూడా ఒక కారణం ఉంది. మరి ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొంత మంది ఔత్సాహికులు.. పాత నాణెలు, నోట్లను సేకరించడానికి విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. పాత నోట్లు, నాణెలు కోసం ఎంత వెచ్చించడానికైనా సిద్ధపడుతారు. ఇలాంటి పాత నాణెలు, కరెన్సీ నోట్లు విక్రయించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. ఒక వెబ్‌సైట్ ప్రకారం.. ఒక పురాతన, బ్రిటీష్ పాలనా కాలానికి చెందిన నాణెన్ని ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఆ నాణెన్ని ఓ వ్యక్తి రూ. 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. కారణం ఇది చాలా అరుదైన నాణెం. 1885లో భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో ఈ నాణెన్ని జారీ చేశారు. అందుకే దానిని కొనుగోలు చేసేందుకు సదరు కొనుగోలుదారుడు అంత ఆసక్తి కనబరిచాడు. ఒక నాణెం ఇంతపెద్ద మొత్తంలో పలకడంతో.. విక్రేత మొదలు విషయం తెలిసిన అందరూ షాక్‌కు గురయ్యారు.

మీ వద్ద కూడా పాత నాణెలు ఉన్నట్లయితే మీరు కూడా కోటీశ్వరులు అయిపోయే అవకాశం ఉంది. అందుకు మీరు చేయాల్సిందల్లా.. మీ వద్ద ఉన్న పురాతన నాణెలను వెబ్ సైట్‌లలో ఆన్‌లైన్ వేలం వేయాలి. ఓల్డ్ కాయిన్ విక్రయించే వెబ్‌సైట్‌లలో ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి.. మీ వద్దనున్న అరుదైన నాణెలకు సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. అలా వాటిని విక్రయించి.. డబ్బును సంపాదించవచ్చు.

ఇదిలాఉంటే.. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ వేలంలో ఒక అమెరికన్ నాణెం 18.9 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 138 కోట్లు అన్నమట. ఈ నాణెం 1933 సంవత్సరంలో జారీ చేశారు. అందుకే దానికి అంత క్రేజ్ వచ్చింది.

Also read:

Somireddy: ఎక్కువ స్ధానాలు గెలిచామని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది: సోమిరెడ్డి

Punjab New CM: పంజాబ్ కొత్త సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ

Pulse Pressure: విశ్రాంతి సమయంలో నాడి వేగం గుండె పనితీరుకి చిహ్నం.. ఎలా నాడివేగాన్ని గుండె వేగాన్ని చూసుకోవాలంటే..