AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా? నోస్ట్రడామస్ భవిష్యవాణి వైరల్‌..

2026 సంవత్సరానికి సంబంధించి ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ (Nostradamus) చేసినట్లుగా చెబుతున్న కొన్ని అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం (World War 3) ముప్పు పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. నోస్ట్రడామస్ రాసిన ప్రోఫెసీస్ గ్రంథంలోని పద్యాలను ఉటంకిస్తూ 2026లో ప్రపంచం ఒక భారీ యుద్ధాన్ని చూడబోతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

2026లో మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా? నోస్ట్రడామస్ భవిష్యవాణి వైరల్‌..
Nostradamus
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 7:49 AM

Share

ప్రపంచ గమనాన్ని వందల ఏళ్ల క్రితమే అంచనా వేశారని నమ్మే నోస్ట్రడామస్ భవిష్యవాణి మరోసారి ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆయన పద్యాల్లోని కొన్ని సంకేతాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో వస్తున్న కొన్ని తీవ్రమైన హెచ్చరికలు, నిర్ణయాలను జ్యోతిష్య అంచనాలతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చిలికి చిలికి గాలివానలా మారి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని, ఇందులో అణ్వాయుధాల వినియోగం జరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత అంతమయ్యే స్థాయిలో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఈ అంచనాల్లో కనిపిస్తున్నాయి.

నోస్ట్రడామస్ అంచనాలపై గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఆయన రాసిన విషయాలు చాలా నిగూఢంగా ఉంటాయి. వాటిని ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకునే అవకాశం ఉంటుంది. గతంలో హిట్లర్ రాక, సెప్టెంబర్ 11 దాడులు వంటివి ఆయన అంచనా వేశారని చాలామంది నమ్ముతారు. అయితే, ప్రతి ఏటా ఇలాంటి ప్రళయ కాల అంచనాలు రావడం సహజమని, కేవలం సోషల్ మీడియా ప్రచారం చూసి భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, ఆర్థిక సంక్షోభాలు, సరిహద్దు గొడవలు ఈ తరహా వార్తలకు ఊతమిస్తున్నాయి. అయితే, దౌత్యపరమైన చర్చల ద్వారా ఇలాంటి యుద్ధ ముప్పులను నివారించవచ్చని రాజకీయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 2026 ప్రపంచ చరిత్రలో ఒక కీలకమైన సంవత్సరంగా మిగిలిపోనుందన్నది మాత్రం స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే