కైలాసానికి భారతీయులకి నో ఎంట్రీ.. ఇండియాను బ్లాక్ లిస్ట్ లో పెట్టానంటున్న నిత్యానంద‌

కిడ్నాప్, అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి రాత్రికి రాత్రే పారిపోయిన  నిత్యానంద తాజాగా రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 7:30 pm, Thu, 22 April 21
కైలాసానికి భారతీయులకి నో ఎంట్రీ.. ఇండియాను బ్లాక్ లిస్ట్ లో పెట్టానంటున్న నిత్యానంద‌
Nityananda

కైలాసానికి భారతీయులకి నో ఎంట్రీ
భారత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టా
వైరల్‌ అవుతోన్న నిత్యానంద వీడియో

 

కిడ్నాప్, అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి రాత్రికి రాత్రే పారిపోయిన  నిత్యానంద తాజాగా రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. సొంతంగా కైలాసదేశాన్ని సొంత కరెన్సీని  ఏర్పాటు చేసుకుని డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్ని నిత్యానంద కోసం భారత్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

2019లో గుట్టుచప్పుడు కాకుండా నకిలి పాస్ పోర్టుతో రాత్రికి రాత్రే ఈక్వెడార్ కు చెక్కేసిన నిత్యానంద  అక్కడ సొంతంగా కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నాళడు. మన దేశంలో బెంగళూరు సమీపంలోని బిడిదిలో ధ్యానపీఠం ఆశ్రమంతో  వేలాది మంది భక్తులను ఆకర్షించిన నిత్యానందకు తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఆశ్రమాలు ఉన్నాయి.

కరోనా వైరస్ మొదటి దశలో కైలాసంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని గతంలోనే ప్రకటించుకున్నాడు నిత్యానంద. ఇప్పుడు తన దేశంలోకి భారతీయులు ఎవ్వరినీ అనుమతించనని వీడియోలో తెలిపాడు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం నుంచి ఏ ఒక్క భక్తుడు కూడా కైలాసదేశంలో  అడుగుపెట్డడానికి వీల్లేదని భారత్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు నిత్యానంద అన్నాడు. అంతేకాదు భారత్‌తో పాటు  బ్రెజిల్, యూరోపియన్ దేశాలు, మలేషియా భక్తులకి నో ఎంట్రీ అంటూ నిత్యానంద మాట్లాడిన వీడియోపై  నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. భారత పోలీసులకు నువ్వు పట్టుబడే రోజు రానే వస్తుంది. అప్పుడిక నీ పని ఫినిష్‌ అంటూ
మనోళ్ళు ఓ ఆటాడేసుకుంటున్నారు.

Also Read: మండుటెండలో విధులు నిర్వహిస్తున్న నిండు గర్భిణి.. లేడీ సింగంను ప్రశంసలతో ముంచెత్తున్న నెటిజన్లు

కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..