AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. కారణం అదే!

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. న భూతో.. న భవిష్యత్త అన్న విధంగా వీరి వివాహం కన్నుల పండుగగా అయ్యింది. ఈ పెళ్లి వేడుకకు ప్రపంచ నలుమూలలో ఉన్న వీఐపీలు అందరూ తరలి వచ్చారు. సౌత్ ఇండియన్ యాక్టర్స్ కూడా చాలా మంది వెళ్లారు. వీఐపీలు, వీవీఐపీలతో ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ కిటకిటలాడింది. అంతే కాకుండా అనంత్ పెళ్లికి ముందు 50 మంది..

Viral Video: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. కారణం అదే!
Viral Video (1)
Chinni Enni
|

Updated on: Jul 15, 2024 | 5:55 PM

Share

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. న భూతో.. న భవిష్యత్త అన్న విధంగా వీరి వివాహం కన్నుల పండుగగా అయ్యింది. ఈ పెళ్లి వేడుకకు ప్రపంచ నలుమూలలో ఉన్న వీఐపీలు అందరూ తరలి వచ్చారు. సౌత్ ఇండియన్ యాక్టర్స్ కూడా చాలా మంది వెళ్లారు. వీఐపీలు, వీవీఐపీలతో ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ కిటకిటలాడింది. అంతే కాకుండా అనంత్ పెళ్లికి ముందు 50 మంది నిరుపేదల పెళ్లిళ్లు చేసి.. వారికి భారీగా కానుకలు అందజేశారు.

ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌ నుంచి కూడా ఎంతో మంది సినీ తారలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంబానీ పెళ్లిలో దాదాపు మూడు వేల రకాల ఫుడ్ ఐటెమ్స్‌ని అథితులకు వడ్డించారు. ఈ పెళ్లికి వచ్చే వారి కోసం స్పెషల్‌గా జెట్ విమానాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అతిథులకు మర్యాదలో లోటు లేకుండా చూసుకున్నారు అంబానీ ఫ్యామిలీ.

ఈ పెళ్లిలో అన్నీ తానై చూసుకున్నారు నీతా అంబానీ. పెళ్లి ఏర్పాట్ల క్రెడిట్ మొత్తం మా అత్తగారిదే అని నవ వధువు రాధికా కూడా చెప్తూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీకి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో చివరి రోజు మంగళ ఉత్సవ్‌ కార్యక్రమంలో నీతా అంబానీ మీడియాకు హృదయ పూర్వ కృతజ్ఞతలు తెలియజేశారు.

రెండు చేతులు జోడించి మరీ.. ఆమె మాట్లాడటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అనంత్ – రాధిక పెళ్లి సమయంలో సపోర్ట్ చేసినందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తమ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. పెళ్లి అన్నాక కొన్ని పొరపాట్లు జరగడం కామన్ అని.. మీరంతా అర్థం చేసుకుంటారని ఆమె చెప్పారు. అపర కుబేరుడి భార్య అయి ఉండి ఆమె ఇలా మాట్లాడటం వైరల్‌గా మారింది.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్