Viral Video: బర్త్ డే పార్టీలో అప్పటివరకు అంతా హ్యపీనే.. ఎగ్జాట్‌గా కేక్ కట్ చేసే సమయంలో ఊహించని షాక్
పుట్టిన రోజు వేడుకలను ఎంతో సంబంరంగా జరుపుకుంటారు. స్నేహితులతో, సన్నిహితులతో కుటుంబంతో ఎంతో ఘనంగా వేడుకలను సెలబ్రెట్ చేసుకుంటారు.

పుట్టిన రోజు వేడుకలను ఎంతో సంబంరంగా జరుపుకుంటారు. స్నేహితులతో, సన్నిహితులతో కుటుంబంతో ఎంతో ఘనంగా వేడుకలను సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే మారుతున్న కాలంతోపాటు.. బర్త్ డే సెలబ్రెషన్స్ నిర్వహించే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో బర్త్ డే పార్టీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో కొన్ని ఘటనలు ఫన్నీగా కొనసాగుతుండగా.. మరికొన్ని ఊహించని షాకిస్తాయి. అయితే ఇటీవల కొన్ని సందర్భాల్లో వేడుకలలో ఉపయోగించే వస్తువులు అనుకోని విధంగా ముప్పు కలిగిస్తాయి. తాజాగా ఓ యువతికి.. పుట్టిన రోజు వేడుకలలో అనుకోని షాక్ తగిలింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఓ యువతికి తన స్నేహితులు ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అందమైన కేక్ తీసుకువచ్చి..క్యాండిల్స్ వెలిగించి సంబంరంగా వేడుకలు నిర్వహించారు. అంతా చుట్టూ చేరి క్లాప్స్ కోడుతూ.. ఆ అమ్మాయికి పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. ఇక బర్త్ డే సంబరాల్లో ఆనందగా ఉన్న యువతి క్యాండిల్స్ ఆర్పడానికి కేక్ పై తల వాల్చింది. దీంతో అక్కడే వెలుగుతున్న క్యాండిల్స్ ఆ అమ్మాయి జుట్టుకు తగిలి మంటలు వచ్చాయి. దీంతో ఊహించని ఆ సంఘటనకు ఆ యువతి భయంతో కేకలు వేసింది. అక్కడే వున్న తన స్నేహితులు ఆ మంటలు ఆర్పేసారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో రిచీ అనే యూజర్ షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
Also Read: Sai Dharam Tej: సాయికి చేయూతగా సేనాని.. మేనల్లుడి కోసం రంగంలోకి పవర్ స్టార్..
Maha Samudram: మహా యుద్ధం మొదలు.. ఆసక్తికరంగా మహా సముద్రం ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్..
Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్బాస్కు ఏమైంది.. ఇన్ని తప్పులు జరుగుతున్నాయేంటి..?