Viral: రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి.. అమాంతం ఊరిని మింగేసేనంత.. చూసి ఖంగుతిన్న పరిశోధకులు
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి. వాటిల్లో కొన్నింటికి పరిశోధకులు...
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి. వాటిల్లో కొన్నింటికి పరిశోధకులు దగ్గర ఇప్పటికీ సమాధానాలు లేవు. అలాంటి క్రేజీ మిస్టరీనే ఇప్పుడు మేము చెప్పబోయేది. చదివితే మీరు ఆశ్చర్యపోతారంతే..
స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ వినే ఉంటారు. అందులో అప్‌సైడ్ డౌన్ వరల్డ్ కంటూ కొన్ని గేట్స్ తెరుచుకుంటే.. అంటే సింక్ హోల్స్ లాగ.. సరిగ్గా అలాంటిదే ఒకటి ఉత్తర చిలిలోని టియెర్రా అమరిల్లా కమ్యూన్‌లో ఏర్పడింది. దాని వెడల్పు 25 మీటర్లు ఉండగా.. లోతు ఏకంగా 200 మీటర్లు ఉంది. ఆ రహస్య సింక్ హోల్‌ను చూసిన పరిశోధకులు దెబ్బకు ఖంగుతిన్నారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. ఆ సింక్ హోల్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు అది 82 అడుగులు విస్తరించినట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు సింక్ హోల్ ఉన్న ప్రాంతంలో మైనింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. దాదాపు 200 మీటర్లు లోతు ఉన్న ఆ సింక్ హోల్ అడుగున ఎలాంటి రసాయన పదార్ధం లేదా మరేదైనా వస్తువును గుర్తించలేదు. కేవలం చాలా మొత్తంలో నీరు ఉన్నట్లు ర్యాడార్లు ట్రేస్ చేశాయని జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టర్ డేవిడ్ మోంటెనెగ్రో వెల్లడించారు.
ప్రస్తుతం ఆ సింక్ హోల్ కారణంగా దాని చుట్టూ ఉన్న ప్రాంతానికి, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని.. దగ్గరలో జరుగుతున్న మైనింగ్ ప్రక్రియను కొద్దిరోజులు ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఆ చుట్టుప్రక్కల ప్రతీసారి ఏదొక మైనింగ్ పనులు జరుగుతుంటాయి. అందువల్ల అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. అయితే ఆ సింక్ హోల్ గురించి తమ బృందం పూర్తిగా దర్యాప్తు చేస్తోందని ఆ ప్రాంత మేయర్ జునిగా అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..