Viral: గుంతలు తవ్వుతుండగా వినిపించిన వింత శబ్దం.. ఏంటా అని చూడగా కళ్లు జిగేల్!
ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు ఓ భూమిని చదును చేస్తున్నారు. గుంతలు కోసం మట్టిని తవ్వుతుండగా..
ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు ఓ భూమిని చదును చేస్తున్నారు. గుంతలు కోసం మట్టిని తవ్వుతుండగా వారికి వింత శబ్దం ఒకటి వినిపించింది. ఏంటా అని వెలికితీయగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి కూలీలు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆ కథేంటంటే.?
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లా అయన్‌మేట్టుపట్టిలోని ఓ భూమిని చదును చేస్తున్నారు కొంతమంది కూలీలు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గుంతలు తవ్వుతుండగా.. వారికి ఓ భారీ శబ్దం వినిపించింది. ఏమై ఉంటుందా అని అక్కడున్న మట్టిని వెలికి తీశారు. అంతే! వారి కళ్లు ఒక్కసారిగా జిగేల్‌మన్నాయి. సుమారు 2 వేల ఏళ్లనాటి ప్రాచీన మట్టిపాత్ర.. దానితో పాటు ఓ ఇనుప గొడ్డలి బయటపడింది. వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు స్పాట్‌కు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..