Viral Video: పాము- ఉడత పోరాటం.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో చూడండి..
పాములకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. పాములను చూస్తే చాలు పరుగందుకుంటారు కొంతమంది మాత్రం దైర్యంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు.

Viral Video: పాములకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. పాములను చూస్తే చాలు పరుగందుకుంటారు కొంతమంది మాత్రం దైర్యంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు. ఇక పాములు జంతువులను వేటాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం.. చిన్న పాములనుంచి పెద్ద పెద్ద పైథాన్ ల వరకు జంతువులను వేటాడి తింటూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియాలో పాము ఓ ఉడతను వెంటాడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు ఒక ఉడుత గోడపై పరిగెత్తడం దాని పట్టుకోవడానికి పాము పాకడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
పాము గోడపై పాకుతూ తన వైపు వస్తుంటే ఆ ఉడతా దానితో పోరాడటానికి ప్రయత్నించింది. అయినా కూడా పాము బాహాయపడకుండా ఆ ఉడతా వైపు వస్తూనే ఉంది. రెండు మూడు సార్లు ఆ ఉడతా పాము పై దాడి చేసేందుకు ప్రయతించింది. లాభం లేదనుకున్న ఉడతా అక్కడి నుంచి జరుగుకుంది. ఇంతలో ఓ పక్షి అక్కడకు వచ్చింది. ఆ పక్షి పాము పై దాడి చేసి ఉడతను కాపాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పాము, ఉడుత మధ్య జరిగే పోరాటంలో ఒక పక్షి రావడం అది పాముపై దాడి చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కెయండి.




Squirrel Fight with Snake on wall. #GilhariSnakeFightVideo pic.twitter.com/e5Ii5mG4Pd
— Shivjeet Chauhan (@shivjeetchauhan) July 23, 2022