Elonmusk Friend: ‘మస్క్’ మామ జిగిరీ దోస్త్ మన ఇండియనే.. ఆయన ట్వీట్ చేస్తే చాలు..!

Elonmusk Friend: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఎవరినీ పెద్దగా నమ్మరు. కానీ విచిత్రంగా ఓ ఇండియన్‌ టెకీ ఆయనకు దోస్తు అయ్యాడు. మామూలు దోస్తు కాదు.

Elonmusk Friend: ‘మస్క్’ మామ జిగిరీ దోస్త్ మన ఇండియనే.. ఆయన ట్వీట్ చేస్తే చాలు..!
Musk Friend

Updated on: May 20, 2022 | 11:16 AM

Elonmusk Friend: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఎవరినీ పెద్దగా నమ్మరు. కానీ విచిత్రంగా ఓ ఇండియన్‌ టెకీ ఆయనకు దోస్తు అయ్యాడు. మామూలు దోస్తు కాదు. ఆయన ఏ ట్వీట్ చేసినా వెంటనే కామెంట్ చేస్తుంటారు మస్క్. అవును, ప్రతి ఒక్కరికీ నమ్మకమైన స్నేహితుడు ఒకరైనా ఉంటారు. కానీ ప్రణయ్‌ పఠోలేకు అరుదైన మిత్రుడు ఉన్నారు. ఆయనే టెస్లా ఈసీవో ఎలన్‌ మస్క్‌. ఎంతో బిజీగా ఉండే మస్క్ సాధారణంగా ఎవరికీ దొరకరు. కానీ ప్రణయ్‌కు మాత్రం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటారు. టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తున్న ప్రణయ్‌ పఠోలే ప్రపంచ కుబేరుడి బెస్ట్‌ ఫ్రెండ్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.

ప్రణయ్‌ పఠేలే చేసే ట్వీట్లకు కామెంట్ల రూపంలో ఎక్కువగా స్పందిస్తుంటారు ఎలన్‌ మస్క్‌. ఇద్దరు నిరంతరం ట్విటర్‌లో టచ్‌లో ఉంటారు. ఈ కారణంగా ప్రణయ్‌ ట్వీట్స్‌ రీచ్‌ కూడా పెరిగిపోయింది. ట్విట్టర్‌లో ఆయనకు ఫాలోయర్స్‌ లక్ష దాటిపోయారు. ప్రణయ్ మార్స్ గురించి ట్వీట్ చేసినప్పుడు, ఎలన్‌ మస్క్ స్పందించారు. ఆ ట్వీట్‌కి 28 వేలకు పైగా రీట్వీట్స్, 1.38 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ప్రణయ్‌కు, మస్క్‌కు స్నేహం కుదిరింది కూడా ట్విట్టర్‌లోనే.. ప్రణయ్ ఇంజనీరింగ్ సెకండ్‌ ఇయర్‌ చదివే సమయంలో టెస్లా ఆటోమేటిక్ విండ్‌స్క్రీన్‌ వైపర్స్‌లో నెలకొన్న సమస్యపై ట్వీట్‌ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన ఎలన్ మస్క్ తదుపరి రిలీజ్‌లో కచ్చితంగా దాన్ని సరిదిద్దుతానని తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దోస్తీ రాను రాను బలపడింది. మస్క్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయనతో స్నేహం తనకు కలిగిన ఎంతో పెద్ద అదృష్టం అంటున్నారు ప్రణయ్‌ పఠోలే.