AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

British Couple: ఆ జంట జీవితాన్ని మార్చేసిన లాటరీ టికెట్.. ఏకంగా రూ.1800 కోట్లు గెలుపు..

ఓ జంట.. లాటరీలో జాక్ పాట్(Jock Pot) కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మనదేశ కరెన్సీలో కొన్ని కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ.. ప్రణాళిక వేస్తున్నారు.

British Couple: ఆ జంట జీవితాన్ని మార్చేసిన లాటరీ టికెట్.. ఏకంగా రూ.1800 కోట్లు గెలుపు..
British Couple
Surya Kala
|

Updated on: May 20, 2022 | 1:01 PM

Share

British Couple: అదృష్ట  వంతుడిని పాడు చేసేవాడు లేడు.. దురదృష్ట వంతుడిని బాగుచేసేవాడు లేడు… అనే సామెత ఒకొక్కసారి కొన్ని కొన్ని సంఘటనలు చుస్తే వెంటనే గుర్తుకొస్తుంది. అవును అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరికీ తెలీదు. ఈ విషయం ముఖ్యంగా లాటరీలు విషయంలో వెల్లడవుతూ ఉంటుంది. తాజాగా ఓ జంట.. లాటరీలో జాక్ పాట్(Jock Pot) కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మనదేశ కరెన్సీలో కొన్ని కోట్ల రూపాయలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులతో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ.. ప్రణాళిక వేస్తున్నారు. మరి ఆ లక్కీ జంట లండన్(London) కు చెందినవారు. వివరాల్లోకి వెళ్తే..

లండన్‌కు చెందిన ఓ జంట లాటరీలో జాక్‌పాట్‌ కొట్టింది. యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్‌ లాటరీలో గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో, జెస్‌థ్వైట్‌ అనే దంపతులు 184 మిలియన్‌ పౌండ్లు (మనదేశ కరెన్సీలో దాదాపు రూ.1800కోట్ల) జాక్‌పాట్‌ కొట్టేశారు. దీంతో వీరు రాత్రికి రాత్రే అపర కుబేరులు అయ్యారు. లాటరీలో ఇంతమొత్తం డబ్బు రావడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. 49 ఏళ్ల జో .. కమ్యూనికేషన్స్ సేల్స్ ఇంజనీర్, 44 ఏళ్ల జెస్.. ఆమె సోదరితో కలసి హెయిర్ సెలూన్‌ను నడుపుతున్నారు. ఈ దంపతులకు వివాహమై 11 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు.

లాటరీ లో భారీమొత్తంలో డబ్బులను సొంతం చేసుకున్న ఈ జంట తమ కలలను సాకారం చేసుకునే అదృష్టం దక్కిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కలలు కనే సమయాన్ని ఇస్తుందని చెబుతున్నారు. అయితే 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్‌ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకుని రికార్డ్‌ సృష్టించాడు. కాగా ఇప్పుడు 1800 కోట్లు జాక్‌పాట్‌ గెలుచుకొని ఈ జంట ఆ రికార్డును బద్దలుకొట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: అత్త, ఆడబిడ్డలను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఆస్తి కోసమే అమానుష ప్రవర్తన 

NRI News: వర్జీనియాలో ఘనంగా “ఆటా” టేబుల్ టెన్నిస్ పోటీలు.. చురుగ్గా పాల్గొన్న తెలుగువారు

Viral Video: బాలీవుడ్ సినిమా డైలాగ్‌తో టాంజానియా అన్నా చెల్లెలు.. నెట్టింట్లో వీడియో వైరల్