AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! వీడియో పై భారతీయ అమెరికన్లు ఆగ్రహం

అమెరికాలో రోడ్డు భద్రతపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) విడుదల చేసిన ఒక AI జనరేటెడ్‌ వీడియో తీవ్ర దుమారం రేపింది. 'ట్రాన్స్‌ఫార్మర్స్‌' సినిమా పాత్రలను పోలిన ఏఐ (AI) గ్రాఫిక్స్‌తో కూడిన పోస్టర్‌ను డీహెచ్ఎస్ విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో గడ్డంతో ఉన్న ఒక భారతీయ వ్యక్తిని ఉద్దేశించి, "అమెరికా అమెరికన్ల కోసమే.. రోడ్ల మీద నుంచి తప్పుకోండి, మీకు డ్రైవింగ్ చేయడం రాదు మిస్టర్ సింగ్ " అనే నినాదాలను చేర్చారు. అంతేకాకుండా "సెల్ఫ్ డిపోర్ట్ (స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లండి) కాకపోతే పరిణామాలు ఎదుర్కోండి" అంటూ హెచ్చరించారు.

భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! వీడియో పై భారతీయ అమెరికన్లు ఆగ్రహం
Us Poster Sparks Racism Row On Indians
Sharada V
|

Updated on: Sep 11, 2026 | 6:22 PM

Share

రోడ్ల పై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న విదేశీ డ్రైవర్లు స్వచ్ఛందంగా దేశం వీడాలని (సెల్ఫ్ డిపోర్ట్) ఆ వీడియోలో హెచ్చరించారు.. గతంలో నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి పలువురి మరణానికి కారణమైన హర్జీందర్‌ సింగ్‌, రాజీందర్‌ కుమార్‌, బెకాన్‌ బిషెకేవ్‌, జస్వీర్‌ సింగ్‌ల ఫొటోలను ఆ వీడియోలో ఉంచారు. ఈ వివాదాస్పద వీడియోను డీహెచ్‌ఎస్‌ తన అధికారిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడంతో, నిర్దిష్ట వర్గాలను టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

అంతేకాకుండా, 2014 నాటి హాలీవుడ్ హిట్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్‌టిన్షన్‌’ సినిమాకు పేరడీగా ఈ కొత్త వీడియోకు ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్‌ ఆఫ్‌ డిపోర్టేషన్‌’ అని పేరుపెట్టడం అమెరికాలో తీవ్ర దుమారానికి, విమర్శలకు కారణమైంది. అమెరికాలో లక్షలాది మంది సిక్కులు, హిందువుల పేర్ల చివర్లో ‘సింగ్’, ‘కుమార్’ వంటి సాధారణ పేర్లు ఉంటాయని, వీరంతా రోడ్డు ప్రమాదాలు చేస్తారన్నట్లు ఏఐ వీడియో రూపొందించడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం తమను శత్రువులుగా భావిస్తోందా అని సిఖ్ కోలిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  ఇది ముమ్మాటికీ జాతి వివక్ష, భారతీయులను కించపరిచేలా ఉందని సిక్కు , హిందూ అమెరికన్ సంస్థలు (HAF, Sikh Coalition) తీవ్రంగా మండిపడ్డాయి.

ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి అక్రమంగా అమెరికాకు రాలేదని, అలాగే ప్రతి సిక్కు డ్రైవర్ రోడ్లపై ప్రమాదాలు చేయట్లేదని ఆ సంఘాలు స్పష్టం చేశాయి. కావాలనే సిక్కులను నేరస్థులుగా చిత్రీకరిస్తూ యావత్ సిక్కు, భారతీయ సమాజాన్ని కించపరుస్తున్నారని, ఇది ముమ్మాటికీ జాత్యహంకారమేనని మండిపడ్డాయి.

ఈ పోస్టర్‌పై అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత రావడంతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా డీహెచ్ఎస్ తీరును తప్పుబట్టారు. వివాదం ముదరడంతో అధికారులు ఆ పోస్టర్‌ను తొలగించారు. అయితే, అక్రమ వలసదారులు ముఖ్యంగా కమర్షియల్ డ్రైవర్లుగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగానే ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు డీహెచ్ఎస్ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..