AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్ నిర్ధారణ: పెంపుడు కుక్కలు నిజంగా మనుషులలో క్యాన్సర్‌ను గుర్తించగలవా?

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. అయితే, చాలా రకాల క్యాన్సర్లు చివరి దశకు చేరే వరకు వాటి లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ఈ సవాలును జయించడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. ప్రకృతి ప్రసాదించిన కుక్కల ఆఘ్రాణ శక్తి ని, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను మిళితం చేసి క్యాన్సర్ గుర్తింపులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

క్యాన్సర్ నిర్ధారణ: పెంపుడు కుక్కలు నిజంగా మనుషులలో క్యాన్సర్‌ను గుర్తించగలవా?
Dogs Detect Cancer
Jyothi Gadda
|

Updated on: Sep 11, 2026 | 5:39 PM

Share

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. అయితే, చాలా రకాల క్యాన్సర్లు చివరి దశకు చేరే వరకు వాటి లక్షణాలు స్పష్టంగా కనిపించవు. ఈ సవాలును జయించడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. ప్రకృతి ప్రసాదించిన కుక్కల ఆఘ్రాణ శక్తి ని, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను మిళితం చేసి క్యాన్సర్ గుర్తింపులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.

కుక్కలకు సాధారణంగా అద్భుతమైన గ్రహణశక్తి ఉంటుంది. అందుకే పోలీస్ శాఖ నేర పరిశోధన, దొంగతనాల గుర్తింపు కోసం వాటిని ఉపయోగిస్తుంది. ఇప్పుడు, కుక్కలకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని వైద్య రంగంలో ఉపయోగించుకోవడానికి భారతదేశంలో పరిశోధన వేగంగా పురోగమిస్తోంది. కుక్కలలో ఉండే ఘ్రాణ శక్తి మనుషుల కంటే దాదాపు 10,000 నుంచి 1,00,000 రెట్లు ఎక్కువ. మానవ శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, అవి ప్రత్యేకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి శ్వాస, చెమట, మూత్రం, లాలాజలం ద్వారా బయటకు వస్తాయి. ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలు ఈ అత్యంత సూక్ష్మమైన వాసనలను పసిగట్టి, 97శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్‌ను పసిగట్టగలవని పరిశోధనల్లో తేలింది.

అయితే ప్రతి ఆసుపత్రిలో శిక్షణ పొందిన కుక్కలను అందుబాటులో ఉంచడం ఆచరణాత్మకంగా కష్టం. అందుకే శాస్త్రవేత్తలు కుక్క ముక్కు పనిచేసే విధానాన్ని అధ్యయనం చేసి, దాని ఆధారంగా ఈ-నోస్, ఏఐ సెన్సార్లను రూపొందించారు. ఇవి శ్వాస లేదా మూత్రం నమూనాలలోని సూక్ష్మ రసాయన వైవిధ్యాలను సేకరిస్తాయి. కుక్క మెదడు వాసనలను ఎలా విశ్లేషిస్తుందో, అదే రీతిలో ఏఐ డేటాను విశ్లేషించి క్యాన్సర్ ఉందో లేదో తక్షణమే స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పరిశోధన వల్ల కలిగే లాభాలు:

ఎలాంటి తీవ్రమైన లక్షణాలు బయటపడక ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. బయాప్సీ లేదా రక్త నమూనాలు లేకుండా కేవలం శ్వాస లేదా మూత్రం ద్వారానే పరీక్షించవచ్చు. ఖరీదైన స్కానింగ్‌లు, ల్యాబ్ పరీక్షలతో పోలిస్తే ఇది చాలా చౌకగా అందుబాటులోకి వస్తుంది. ప్రకృతి ప్రసాదించిన విజ్ఞానాన్ని, మానవ నిర్మిత కృత్రిమ మేధస్సుతో జోడించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ రంగంలో ఒక గొప్ప విప్లవం రాబోతోందని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us