Viral Video: స్కూటర్‌పై ఎలుక అద్భుత విన్యాసాలు.. రండి బాబూ రండి.. ఎక్కడికైనా తీసుకెళ్తానంటున్న చూహా

ప్రస్తుతం యువతీ యువకులకు సంబంధించిన స్టంట్ విన్యాసాలకు సంబంధించిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందు కోసం రోజూ రకరకాల వీడియోలు తయారు చేసి షేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనుషులను చూసి జంతువులు కూడా విన్యాసాలు చేయడం మొదలుపెట్టినట్లు ఉన్నాయి. అందుకు సాక్ష్యం ఈ వీడియో. ఇక్కడ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా గడుపుతుంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Viral Video: స్కూటర్‌పై ఎలుక అద్భుత విన్యాసాలు.. రండి బాబూ రండి.. ఎక్కడికైనా తీసుకెళ్తానంటున్న చూహా
Mouse Video Viral

Updated on: Dec 02, 2023 | 4:51 PM

ఎవరికైనా మూడ్ ఆఫ్‌లో ఉన్నా ఏదైనా చేయాలని భావించినా చాలా మంది సోషల్ మీడియా వైపు దృష్టి  సారిస్తారు. రకరకాల వీడియోలను పోస్టులను చూడడానికి ఆసక్తిని చూపిస్తూ .. పేజ్ ను స్క్రోల్ చేస్తారు. ఇలా చేస్తూ తమ సమయాన్ని గడుపుతారు. ఇలాంటి సమయంలో ఫన్నీ రీల్స్‌ కనిపిస్తే.. అప్పుడు మానసిక స్థితిలో మార్పు వస్తుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలను అనేక సార్లు చూస్తూ నవ్వుకుంటారు. ఇలాంటి ఫన్నీ వీడియోల్లో మన మనస్సుకి నచ్చేది పెంపుడు జంతువుల విన్యాసాలు. తమ కుక్కలు, పిల్లులు లేదా గున్న ఏనుగులు వంటివి చేసే కార్యకలాపాలను చాలా ఇష్టపడతారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ కావడానికి ఇదే కారణం. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూస్తే మీ పెదవుల మీద చిరు నవ్వు వస్తుంది.

ప్రస్తుతం యువతీ యువకులకు సంబంధించిన స్టంట్ విన్యాసాలకు సంబంధించిన రీల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందు కోసం రోజూ రకరకాల వీడియోలు తయారు చేసి షేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనుషులను చూసి జంతువులు కూడా విన్యాసాలు చేయడం మొదలుపెట్టినట్లు ఉన్నాయి. అందుకు సాక్ష్యం ఈ వీడియో. ఇక్కడ ఎలుక ఒక బొమ్మ స్కూటర్‌పై విన్యాసాలు చేస్తూ ఆనందంగా గడుపుతుంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో బొమ్మ స్కూటర్‌పై ప్రయాణిస్తూ ఒక చిన్న ఎలుక ఆనందంగా విన్యాసాలు చేస్తూ కనిపించడం మీరు చూడవచ్చు. స్టంట్స్ చేస్తున్న సమయంలో ఎలుక ఒక ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌లా కనిపిస్తుంది. తాను స్టంట్ చేసే సమయంలో ఎలుక స్కూటర్ పై చకచకా రౌండ్స్ కొడుతోంది. ఆపై స్కూటర్ ని అదుపులో చేసి స్కూటర్‌ను సాఫీగా నడుపుతుంది. అయితే ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. ఎలుక స్కూటర్‌ను తనకి తాను నడపడం లేదు.. ఎవరో రిమోట్‌తో కంట్రోల్‌ చేస్తున్నారని అర్థమవుతుంది ఎవరికైనా..

ఈ వీడియో @AMAZlNGNATURE పేరు గల ఖాతాతో Xలో షేర్ చేశారు. దీనికి ఎవరికైనా రైడ్ కావాలా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వార్తలు రాసే వరకు 20 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ‘నిజంగా ఈ ఎలుక ఒక స్టంట్‌మ్యాన్’ అని రాశారు. మరొకరు నేను ఎలుకలను ఇష్టపడను.. అయితే ఇది నిజంగా చాలా అందమైనది అని కామెంట్ చేశారు. చాలా మంది ఇతర వినియోగదారులు ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..