Trending: ఈ ప్లేట్‌కి చాలా స్టోరీ ఉందండోయ్..! 20ఏళ్ల అమ్మప్రేమకు గుర్తుగా మారిన అక్షయ పాత్ర..!

|

Jan 20, 2023 | 9:53 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రీల్స్, షార్ట్స్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న వాటికే వైరల్ గా మారి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్,..

Trending: ఈ ప్లేట్‌కి చాలా స్టోరీ ఉందండోయ్..! 20ఏళ్ల అమ్మప్రేమకు గుర్తుగా మారిన అక్షయ పాత్ర..!
కడగని వంటపాత్రలు: కొన్ని సందర్భాలలోచాలా మంది తమ పడక దగ్గరే టీ, కాఫీ కప్పులు, లేదా భోజనం చేసిన ఎంగిలి ప్లేట్లు ఉంచుతారు. అయితే అది కుటుంబానికి అంత మంచిది కాదు. అది ఇంటి పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇంకా నిద్ర సమయంలో పీడకలలకు కారణం అవుతుంది.
Follow us on

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రీల్స్, షార్ట్స్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న వాటికే వైరల్ గా మారి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్, పంచులు వేయడం, నవ్వించడం.. ఇలా ఒక్కటేమిటి.. సోషల్ మీడియాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా రేయీపగలు అందులోనే మునిగి తేలుతున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో.. మనం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు చాలా వీడియోలు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చినవి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. వాటిని మనం పూర్తిగా చూస్తాం. కొన్ని ఆశ్చర్యపరిచేవి ఉంటే.. మరికొన్ని నవ్వించేవిగా.. ఇంకొన్ని ఎమోషనల్ వీడియోలు ఉంటాయి. ప్రస్తుతం అమ్మకు సంబంధించిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సాధారణంగా మనం.. మన తల్లితండ్రులను చూసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. వారు ఏం చేస్తే అది చేసేందుకు అనుకరిస్తుంటాం. సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. తన తల్లి 20 సంవత్సరాలుగా ఓ ప్లేట్‌లో ఆహారం తిందని ఓ కుమారుడు ట్విట్టర్‌లో వివరాలు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ @vsb_dentist అనే ఖాతా ద్వారా ట్విట్టర్ లో ఉంది. ‘ఇది మా అమ్మ ప్లేట్, ఆమె గత 20 ఏళ్లుగా ఇందులోనే ఆహారం తినేది. ఇది చిన్న ప్లేట్.. ఈ ప్లేట్‌లో నేను, మా చెల్లెలు మాత్రమే తింటాం. అమ్మ చనిపోయిన తర్వాత, ఆమెకు గుర్తుగా ఈ ప్లేట్ నా దగ్గర పెట్టుకున్నాను. దీనిలో తింటే.. మా అమ్మ నాతోనే ఉన్న ఫీలింగ్ కలుగుతోందని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఉద్వేగభరితమైన పోస్ట్ రాసే సమయానికి, 21 వేల మందికి పైగా ప్రజలు చూశారు. 1400 మందికి పైగా ఈ పోస్ట్‌ను రీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా దానిపై వారి అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..