దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ది అగ్రస్థానం. స్వచ్ఛత కార్యక్రమాల్లో ఇండోర్ ఏడేళ్లుగా మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఇండోర్ కేవలం ఆహారం, పరిశుభ్రతకు మాత్రమే కాదు.. ఇప్పుడు అక్కడి ప్రత్యేకమైన పద్మావతి కారణంగా కూడా వార్తల్లోకి వచ్చింది. పద్మావతి అంటే ఎవరో అమ్మాయి అనుకుంటే పొరపాటే.. అది ఒక అందమైన గుర్రం. ఇది దేశంలోనే మోస్ట్ బ్యూటీఫుల్ హార్స్‌గా చెబుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఖరీదు ఎంతో తెలిస్తే ఖంగుతింటారు. అంబానీ కొడుకు పెళ్లి కోసం బుక్ చేయలేకపోయాడట..!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పద్మావతి అనే గుర్రానికి దేశంలోనే అత్యంత డిమాండ్ ఉంది. ఒక్కరోజు పెళ్లి ఊరేగింపు కోసం పద్మావతిని బుక్ చేసుకోవాలంటే భారీ ఖరీదు భరించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ పెళ్లి ఊరేగింపు కోసం పద్మావతి ముంబై వెళ్లనుంది.
ఈ సందర్భంగా అబ్దుల్ మాట్లాడుతూ.. మేము ఇంటర్నెట్‌లో ఈ గుర్రాన్ని చూశామని చెప్పాడు. చూడ్డానికి ఇండోర్ వచ్చానని చెప్పాడు. తొలిచూపులోనే నచ్చిందని చెప్పాడు. భారతదేశం మొత్తంలో ఇలాంటి గుర్రం ఎక్కడా లేదని చెప్పారు. కొన్ని గంటల పెళ్లి ఊరేగింపు కోసం రూ.5 లక్షలకు బుక్ చేసుకున్నట్టుగా చెప్పారు.
ఇక పద్మావతి అందం విషయానికి వస్తే..తెల్లటి రంగులో పద్మావతి 6 అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవుతో చాలా అందంగా ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన గుర్రం ఇదే అంటున్నారు. పద్మావతికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే 2026 వరకు అన్ని డేట్స్ అడ్వాన్స్ బుక్కాయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. పద్మావతికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో.
ముకేశ్ అంబానీ తన కుమారుడి పెళ్లికి పద్మావతిని బుక్ చేయాలని భావించినట్లు సమాచారం. అయితే పద్మావతి ఈ తేదీకి ముందే బుక్ అయిపోవడంతో డీల్ కుదరలేదని తెలిసింది.
3 ఏళ్ల క్రితం పంజాబ్ నుంచి పద్మావతిని కొనుగోలు చేశానని ఈ గుర్రం సంరక్షణాధికారి సచిన్ రాథోడ్ తెలిపారు. నేడు దీని ధర రూ.2 కోట్లకు చేరింది. అయితే రూ.10 కోట్లకు కూడా విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధంగా లేదు. ఇకపోతే, పద్మావతి అందించే ఆహారం కూడా ప్రత్యేకమే. ప్రతిరోజూ 10 లీటర్ల పాలు, 6 కిలోల శనగలు, గడ్డి తింటుంది. దీనిని చూసుకునేందుకు ముగ్గురు ఉద్యోగుల్ని నియమించారు. ఈ ముగ్గురూ రోజూ పద్మావతికి మసాజ్ చేసి వాకింగ్ కి తీసుకెళ్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి