Monsoon: రేపు కేరళలోకి ప్రవేశించనున్న నైరుతీ రుతుపవనాలు.. అలర్ట్ ప్రకటించిన అధికారులు..

|

Jun 02, 2021 | 3:16 PM

Monsoon: నైరుతి రుతుపవనాలు గురువారం నాడు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. అటునుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రవేశించనున్నాయి.

Monsoon: రేపు కేరళలోకి ప్రవేశించనున్న నైరుతీ రుతుపవనాలు.. అలర్ట్ ప్రకటించిన అధికారులు..
Monsoon
Follow us on

Monsoon: నైరుతి రుతుపవనాలు గురువారం నాడు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. అటునుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయన్నారు. రాగల 24 గంటల్లో(గురువారం నాడు) నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. అటు నుంచి జూన్ 12వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయణిస్తాయని చెప్పారు.

ఈ నైరుతి రుతు పవనాల ప్రభావంతో పాటు.. అరేబియా సముద్రంలో ఈదురుగాల కారణంగా కేరళ సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లా్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుందని చెప్పారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు దున్నకాలు కూడా ప్రారంభించారు. ప్రభుత్వాలు కూడా ఖరీఫ్ పంటలకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, రైతులకు రుణాలు తదితర అంశాలపై సమీక్షలు జరిపి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాయి.

Also read:

Murder: అమానుషం.. భార్యను గొడ్డలితో నరికి.. మృతదేహాన్ని వీధిలో ఈడ్చుకెళ్లిన భర్త.. కొడుకును కూడా..