AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఈ కోతి మాముల్ది కాదుగా.. ఒలంపిక్‏కు పంపితే పథకాలన్ని మనకే ఇక..

కోతులు చాలా తెలివైనవి. జంతువులకు.. మనుషులకు వాటి అల్లరి చేష్టలతో చిరాకు పుట్టించడంలో ముందుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో

Viral Video: వామ్మో.. ఈ కోతి మాముల్ది కాదుగా.. ఒలంపిక్‏కు పంపితే పథకాలన్ని మనకే ఇక..
Monkey
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2022 | 1:55 PM

Share

కోతులు చాలా తెలివైనవి. జంతువులకు.. మనుషులకు వాటి అల్లరి చేష్టలతో చిరాకు పుట్టించడంలో ముందుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని పొట్ట చెక్కలయ్యేంతా నవ్విస్తే.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే.. కోతులకు సంధించిన అల్లరి… భావోద్వేగ వీడియోస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. కేవలం అల్లరి పనులు మాత్రమే కాదు.. మనుషులు చేసే పనులను సులువుగా అర్థం చేసుకుంటాయి. అలాగే మనిషి చేసే పనులను కోతులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ఓ కోతి చేసే పని చూస్తే మీరు షాకవ్వడం ఖాయం. ఇంతకీ అంతలా ఆ కోతి ఏం చేసింది అనుకుంటున్నారా ? అయితే ఈ మీరు ఈ స్టోరీ చదవాల్సిందే..

ఆ వీడియోలో ఓ జూపార్క్‏లో ఓ కోతి చిన్న సైకిల్ పై మరో కోతిని ఎక్కించుకుని సైకిల్ తొక్కుతుంది. అచ్చం మనుషుల మాదిరిగానే స్పీడ్‏గా సైకిల్ పై రౌండ్స్ కొట్టేస్తుంది. కోతి సైకిల్ తొక్కుతుండగా.. మరో కోతి వెనకలా తాపీగా కూర్చుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో కోతి సైకిల్ తొక్కడం చూస్తుంటే.. ఈ కోతి ఎన్ని రోజుల ట్రైనింగ్ తీసుకుందో అనే సందేహం కలగకమానదు. కానీ ట్రైనింగ్ తీసుకున్నా.. కోతి సైకిల్ తొక్కడం మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!