ప్రేమ.. నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అది మనుషులైనా.. జంతువులైనా. ముఖ్యంగా మనుషుల కంటే జంతువులు తమ యజమానుల పట్ల ఎక్కువగా ప్రేమతో.. నమ్మకంతో ఉంటాయి. తమ ఓనర్స్.. వారి కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమిస్తాయి. వారిపట్ల ఎంతో విశ్వాసంతో ఉంటాయి. ఇటీవల వన్య ప్రాణులు కూడా ఆహారం కోసమో, నీళ్లకోసమో వనాలను విడిచి జనాల్లోకి వస్తున్నాయి. వీటిలో వానరాలు ముందు వరుసలో ఉంటాయి. వానరం అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇక వాటి వింత చేష్టలను జనం కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లతో కోతులు చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్ని పిల్లతో కలిసి అల్లరి చేస్తాయి. ఆడుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ కోతి చేసిన పనికి ముగ్దులవుతున్నారు.
వీడియోలో ఓ ఇంటిముందు ఓ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి ఓ కోతి వచ్చింది. ఆ బాలుడితో ఎంతో ప్రేమగా మెలిగింది. ఆ బాలుడి తలలో పేలు చూసింది.. ముద్దు పెట్టుకుంది.. వడిలో పడుకోబెట్టుకుంని ఆడిస్తుంది. ఇంతలో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు వచ్చి కోతివద్ద చిన్నారిని చూసి కంగారు పడ్డారు. బాలుడిని కోతిదగ్గరనుంచి తీసుకోడానికి ప్రయత్నించారు. కానీ ఆ కోతి బిడ్డను తననుండి దూరం చేయొద్దన్నట్టుగా… చిన్నారిని వదలకుండా గట్టిగా హగ్ చేసుకుని వదలనంటే వదలనని కూర్చుంది. బిడ్డను తీసుకోడానికి ఎంత ప్రయత్నించినా ఆ కోతి చిన్నారిని వదల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. చిన్నారిపట్ల ఆ వానరం చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయారు. లైక్స్‌తో..రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
The monkey dnt want to give up on baby ??this is too cute pic.twitter.com/KMTkUNh6de
— Harsha Patel ?? (@harshasherni) August 27, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.