Viral Video: నాతో అట్లుంటది మరి.. కింగ్ కోబ్రాను రప్ఫాడించిన కోతి.. కబడ్డీ ఆడుతూ ఎటాక్.. షాకింగ్ వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే, వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. తాజాగా.. భయంకరమైన కింగ్ కోబ్రా, కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: నాతో అట్లుంటది మరి.. కింగ్ కోబ్రాను రప్ఫాడించిన కోతి.. కబడ్డీ ఆడుతూ ఎటాక్.. షాకింగ్ వీడియో..
Viral Video
Follow us

|

Updated on: May 22, 2023 | 8:34 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే, వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. తాజాగా.. భయంకరమైన కింగ్ కోబ్రా, కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ వీడియోను చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైన పామో మనం చెప్పాల్సిన పని లేదు. ఇది కాటేసిందంటే.. నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇలాంటి పాములతో కొందరు ఆటలాడుతుంటారు. మరికొందరు పామును చూసి పరుగులు పెడుతుంటారు. ఎదిఏమైనా పాములు మాత్రం ప్రమాదకరమే.. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, పాము, ముంగిసల మధ్య పోరును చాలాసార్లు చూసుంటారు. కానీ, కోతి, కింగ్ కోబ్రా మధ్య భీకర పోరును ఎప్పుడూ చూసుండరు.

ఓ ప్రాంతంలో కోతి, కింగ్ కోబ్రా తారసపడ్డాయి. ఈ క్రమంలో కాటేయడానికి వచ్చిన కోబ్రాకు కోతి మాత్రం చుక్కలు చూపించింది. దాని కాటు నుంచి తప్పించుకుంటూనే కోతి.. కింగ్ కోబ్రాపై ఎటాక్ చేసింది. కోతిని తాడుతో కట్టేసి ఉన్న ప్రాంతంలో కింగ్ కోబ్రా పాము అటుగా వెళ్తుంది. ఈ క్రమంలో కోతిని చూడగానే పడగ విప్పి బుసలు కొడుతుంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన కోతి.. దాన్ని చూస్తూ అరుస్తుంది. దాన్ని తికమక పెడుతూ కాలితో కొడుతూ.. నొటితో కరుస్తూ కోబ్రాకు చుక్కలు చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాటు నుంచి ఎలాగొలా తప్పించుకుంటూ కోతిపై పాముపై విరుచుకుపడుతుంది. కొన్ని నిమిషాల పాటు వాటి మధ్య భీకర పోరు జరుగుతుంది. చివరకు కోతి నుంచి పాము ఎలాగొలా జారుకుంటుంది. ఈ వీడియోను ట్విట్టర్ లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేయగా.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కోతిని బంధించి వాటిని హింసించడం తప్పంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..