హనుమంతుడే వచ్చి ఓదార్చిన వేళ.. వీడియో వైరల్

బెంగళూరు: సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువులు, స్నేహితులు వచ్చి ఓదార్చడం సహజం. అయితే కర్ణాటకలో మాత్రం ఓ వానరం చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. నిన్న కర్ణాటకలోని నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దాంతో అతని ఇంట్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. బంధువులంతా అతని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి.. సంతాపం తెలిపారు. ఆ […]

హనుమంతుడే వచ్చి ఓదార్చిన వేళ.. వీడియో వైరల్
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2019 | 5:06 PM

బెంగళూరు: సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువులు, స్నేహితులు వచ్చి ఓదార్చడం సహజం. అయితే కర్ణాటకలో మాత్రం ఓ వానరం చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. నిన్న కర్ణాటకలోని నార్గుండ్‌కు చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దాంతో అతని ఇంట్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. బంధువులంతా అతని ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి.. సంతాపం తెలిపారు.

ఆ సమయంలో అనుకోని అతిథిలా ఓ కోతి అక్కడకు వచ్చి ఏడుస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసి.. తల నిమిరి ఓదార్చింది. ఇక అక్కడున్న వారంతా వానరం చేసిన ఈ చర్యను చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరైతే హనుమాన్ జయంతి రోజున స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వానరం గతంలో కూడా ఇలా కొందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చిందని చెప్తున్నారు స్థానికులు.

గట్టిగా ఏడుస్తున్న శబ్దం ఎక్కడ వినిపించినా ఈ కోతి అక్కడ తప్పక ప్రత్యక్షమవుతుందంటున్నారు స్థానికులు. మనుషులు ఒకరిని ఒకరు ఎలా ఓదార్చుకుంటారో అచ్చం ఆ మాదిరిగానే ఈ కోతి కూడా చేస్తుందని చెబుతున్నారు.