Viral: ఏడేళ్ల వయస్సులో బాలిక అదృశ్యం.. సీన్ కట్ చేస్తే.. తొమ్మిదేళ్ల తర్వాత!

ఓ బాలిక ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు కిడ్నాప్‌కు గురైంది. ఈ కిడ్నాప్ కేసు పూర్తిగా తొమ్మిదేళ్లు నడిచింది. ఈ వ్యవహారమంతా..

Viral: ఏడేళ్ల వయస్సులో బాలిక అదృశ్యం.. సీన్ కట్ చేస్తే.. తొమ్మిదేళ్ల తర్వాత!
Girl 1
Ravi Kiran

|

Aug 09, 2022 | 5:30 PM

ఓ బాలిక ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు కిడ్నాప్‌కు గురైంది. ఈ కిడ్నాప్ కేసు పూర్తిగా తొమ్మిదేళ్లు నడిచింది. ఈ వ్యవహారమంతా ముంబై – రాయచూర్ – ముంబై మధ్య సాగింది. సీన్ కట్ చేస్తే.. తొమ్మిదేళ్ల తర్వాత.. కథ సుఖాంతమైంది.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. 2013వ సంవత్సరం జనవరి 22న.. అంధేరీ ప్రాంతంలో ఏడేళ్ల బాలిక పూజ కిడ్నాప్‌కు గురైంది. సోదరుడితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న పూజను హరి డిసౌజా అనే వ్యక్తి అపహరించాడు. బడికి వెళ్లిన పాప.. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడి స్టేషన్‌లో అసిస్టంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రాజేంద్ర భోస్లే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ కేసును ఆయన టేకప్ చేశారు. ఎవరీ క్లూ సేకరించాడు.. పాప కోసం సుమారు రెండేళ్లు గాలించాడు. ఎంత వెతికినా కూడా బాలిక ఆచూకీ దొరకలేదు. ఆయనేమో రిటైర్ అయ్యాడు.

మరోవైపు.. హరి డిసౌజా అనే వ్యక్తి పూజను కిడ్నాప్ చేశాడు. తమకు పిల్లలు లేకపోవడంతో.. ఈమెను పెంచుకోవడానికి ఎత్తుకెళ్ళాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ముంబై నుంచి కర్ణాటకలోని రాయచూర్‌కు పూజ మకాన్ని మార్చాడు. అక్కడే ఓ హాస్టల్‌లో చేర్పించాడు. ఇక 2016లో డిసౌజా దంపతులకు కొడుకు పుట్టాడు. దీంతో ఆమెను తిరిగి ముంబై రప్పించి.. కొడుకు బాధ్యతను పూజ చేతుల్లో పెట్టాడు. దీంతో బాలిక నాలుగిళ్లలో పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చింది. సీన్ కట్ చేస్తే..

డిసౌజా కుటుంబం మళ్లీ అంధేరీ షిఫ్ట్ అయింది. ఇక ఆ ప్రాంతంలోనే పూజ చిన్నప్పుడు తన కుటుంబసభ్యులతో ఉండేది. ఇక ఇక్కడే మనోడు పెద్ద తప్పు చేశాడు. బాలికను అక్కడున్న వారెవరూ గుర్తించలేరని అనుకున్నాడు. బాలిక ఎవ్వరితోనూ మాట్లాడకుండా చూసుకునేవాడు. అయితే ఆమెకు ఇటీవల పనులు చేస్తుండగా 35 ఏళ్ల ప్రమీలా దేవేంద్రతో పరిచయం ఏర్పడింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం ప్రమీలకు చెప్పుకొచ్చింది పూజ. తనతో ఉన్నది తన అసలు తల్లిదండ్రులు కాదని.. ప్రతీరోజూ హింసిస్తున్నారని పూజ ప్రమీలకు చెప్పింది. దీంతో ఇంటర్నెట్‌లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ప్రమీల. ఎలాగోలా పూజ వివరాలను కనిపెట్టగలిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించింది.

కాగా, రంగంలోకి దిగిన పోలీసులు.. పూజ వివరాలపై పూర్తిగా ఆరా తీశారు. అప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన రాజేంద్ర భోస్లే దగ్గర నుంచి కూడా కీలక ఇన్ఫర్మేషన్‌ను అడిగి తెలుసుకున్నారు. హరి డిసౌజా దంపతులు పూజ అసలు తల్లిదండ్రులు కాదని తేలడంతో.. వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను అసలు తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడేళ్ల వయసులో తప్పిపోయిన కుమార్తె.. తిరిగి 16 ఏళ్ల వయసులో తమ దగ్గరకు చేరుకోవడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయింది. ఇలా పూజ కథ చివరికి సుఖాంతమైంది.

ఇవి కూడా చదవండి

Girl Missing

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu