Viral Video: ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్.. షాకవుతున్న నెటిజన్లు! వీడియో వైరల్
పూర్వికుల సంప్రదాయాలు, సాంస్కృతిక జానపద కథల రూపంలో బాగుంటాయి. ఒక్కోసారి ఇలలో వాటిని అమలు చేస్తే ముక్కుమ వేలేసుకోవల్సి ఉంటుంది. తాజాగా మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ అలాంటి పనే చేశారు. మంచి జరగుతుందని ఆ దేశంలోని రెండు శాతాబ్ధాల నాటి ఆచారాన్ని అవలంబించారు. ఇందులో భాగంగా ఏకంగా ఓ ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. ఇందుక సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

మెక్కికోలోని చొంటల్, హువావే అనే రెండు వర్గాలకు చెందిన స్థానిక తెగల మధ్య శాంతియుత ఐక్యత కోసం మేయర్ చొంటల్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. మొసలిని వివాహం చేసుకుంటే మెక్సికో నగరంలో వర్షం, శ్రేయస్సు, సమృద్ధిగా పంటలు, ప్రకృతితో శాంతియుత జీవనం సాధ్యమవుతుందని అక్కడి వారి నమ్మకం. ఈ సంప్రదాయం 230 సంవత్సరాల క్రితం దక్షిణ మెక్సికోలోని ఓక్సాకాలో ప్రారంభమైంది. దక్షిణ మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా మేయర్ డేనియల్ గుటియెర్జ్ ఈ ఆచారంలో భాగంగా ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. ముందుగా మొసలిని వీధుల్లో ఊరేగించి పెళ్లి వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ వేడుకలో మొసలి వధువును ప్రేమగా ‘లా నినా ప్రిన్సెసా’ (యువరాణి) అని పిలుస్తారు. వేడుక ముగిసే వరకు ముసలి వధువులను ఎంతో భక్తితో గౌరవిస్తారు. స్థానిక ఇళ్లను సందర్శించే ఊరేగింపుతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో నివాసితులు ఆనందంగా మొసలి వధువుతో నృత్యం చేస్తారు. సామూహిక స్వాగత ఆచారంలో ఆశీర్వాదాలు అందిస్తారు.
అనంతరం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన తెల్లని వివాహ గౌన్‌తో అలంకరిస్తారు. రిబ్బన్-లేస్డ్ అనే శిరస్త్రాణం కూడా తొడుగుతారు. అయితే ఉత్సవాల సమయంలో భద్రత కోసం మొసలి నోరును గట్టిగా ముందుగానే ఓ తాడుతో కట్టివేస్తారు. అనంతరం సింబాలిక్ వివాహం జరిగే టౌన్ హాల్‌కు తీసుకెళ్తారు. వివాహ వేడుకలో మేయర్ డేనియల్ గుటియెర్రెజ్ ఆచారాలకు నాయకత్వం వహించి.. వధువును చేతుల్లోకి తీసుకుని డ్యాన్స్ చేశారు. మొసలి వధువు ముక్కుపై పలుమార్లు ముద్దులు కూడా పెట్టాడు. ఈ ఆచారం మెక్సికోలో సాంస్కృతిలో ఒక భాగం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
🇲🇽 The Mayor of a Mexican Town Married a Caiman — for Prosperity and Fish
Daniel Gutiérrez held a wedding ceremony with a member of the crocodile family in the town of San Pedro Huamelula. 🐊💍
This ritual has been celebrated for over 230 years and symbolizes the union of two… pic.twitter.com/Gg0W1ob9sL
— NEXTA (@nexta_tv) July 1, 2025
మెక్సికోలో ఇలా మొసలిని వివాహం చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం అంటే 2023లో మేయర్ విక్టర్ హ్యూగో సోసా కూడా ఇదే మాదిరి అలిసియా అడ్రియానా అనే మొసలిని వివాహం చేసుకున్నారు. ఈ వింత ఆచారం ప్రపంచ వ్యాప్తంగా అమితాశ్చర్యాలకు గురి చేస్తుంది. బయటి వ్యక్తులకు ఇది అసాధారణంగా అనిపించవచ్చు. కానీ శాన్ పెడ్రో హువామెలులా ప్రజలకు మాత్రం తరతరాలుగా అందించబడిన లోతైన ఆధ్యాత్మిక, అర్థవంతమైన సంప్రదాయం. ప్రకృతి, సమాజం, సంప్రదాయాల మధ్య సామరస్యం కోసం ఇలా చేస్తారట.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




