Viral Video: ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే ప్రశంసించాల్సిందే!
Viral Video: రైలు ఢీకొనే అవకాశం ఉన్నందున, ఆ మార్గంలో ఉన్న అన్ని రైళ్లను ఆపమని సమాచారం అందించారని తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ నితీష్ కుమార్ బర్కకానాలోని రైల్వే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి అన్ని రైళ్లను వెంటనే..

మనుషులకు, జంతువులకు మధ్య సంబంధం రకరకాలుగా ఉంటుంది. కొన్ని జంతువులను మానవులను సైతం ఆకర్షిస్తాయి. వాటిలో కూడా కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. మనుషులకు ఏదైనా ప్రమాదం పొంచివున్న సమయంలో కూడా జంతువులు కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో రైల్వే పట్టాలపై ఓ ఏనుగు ప్రసవించింది. దీని కారణంగా ట్రైన్ ఏకంగా రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ వీడియో మానవత్వానికి నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాన్ని చూసిన వినియోగదారులు రైల్వే అధికారుల పనిని ప్రశంసిస్తున్నారు.
Beyond the news of human-animal conflicts, happy to share this example of human-animal harmonious existence.
A train in Jharkhand waited for two hours as an elephant delivered her calf. The 📹 shows how the two later walked on happily.
Following a whole-of government approach,… pic.twitter.com/BloyChwHq0
— Bhupender Yadav (@byadavbjp) July 9, 2025
జూన్ 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గర్భిణీ ఆడ ఏనుగు ప్రసవ వేదనతో పట్టాలపై పడి ఉందని తనకు సమాచారం అందిందని రామ్‌గఢ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) నితీష్ కుమార్ తెలిపారు. కానీ అది రైలు ఢీకొనే అవకాశం ఉన్నందున, ఆ మార్గంలో ఉన్న అన్ని రైళ్లను ఆపమని సమాచారం అందించారని తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ నితీష్ కుమార్ బర్కకానాలోని రైల్వే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి అన్ని రైళ్లను వెంటనే ఆపమని కోరారు. ఆ విధంగా అధికారులు రెండు గంటల పాటు రైలును ఆపడం ద్వారా మానవత్వాన్ని ప్రదర్శించారు. తద్వారా ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 9న షేర్ చేయబడిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు జంతువులపై మానవత్వం చాటినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




