Viral: పొలంలో వాగు సమీపాన ఏదో మెరుస్తూ కనిపించింది.. ఏంటని వెళ్లి చూడగా
రోజూ మాదిరిగానే ఆ రైతు పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈలోగా అతడికి అల్లంత దూరంలో ఉన్న వాగు పక్కన బురదలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఆత్రుతగా దగ్గరకు వెళ్లి చూశాడు. అది ఏమై ఉంటుందా అని కొంచెం లోతుగా తవ్వి చూడగా..

లచ్చిందేవి తలుపు తట్టిందంటే ఠక్కున ఆహ్వానించేయాలి. లేదంటే దరిద్రదేవత మన చుట్టూ ఉన్నట్టే. ఈ నానుడికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు మేము చెప్పే స్టోరీ కూడా. ఫ్రాన్స్‌కి చెందిన ఓ రైతుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ వచ్చింది. అయితేనేం ఈలోగా దరిద్రదేవత షేక్ హ్యాండ్ ఇచ్చింది. దెబ్బకు ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. ఇంతకీ ఆ కథ ఏంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని ఆవెర్న్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మైఖేల్ డూపాంట్ అనే రైతు.. రోజూ మాదిరిగానే తన వ్యవసాయ భూమిని పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో అతడికి పొలం పక్కనే ఉన్న వాగులోని బురదలో ఏదో మెరుస్తున్న వస్తువు కంటపడింది. అది ఏంటా అని చూసి కొంచెం లోతుగా తవ్వగా.. అతడి కళ్లను అతడే నమ్మలేకపోయాడు. అక్కడున్నవి అంతా స్వచ్చమైన బంగారు గడ్డలు.. దీంతో ఈ వార్త స్థానికంగా వేగంగా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వెంటనే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, స్థానిక ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం.. ఆ భూమిలో 150 టన్నులకు పైగా బంగారం ఉండొచ్చునని.. దాని విలువ సుమారు 4 బిలియన్ యూరోలు (దాదాపు రూ.35 వేల కోట్లకు పైగా) ఉంటుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ లెక్కలు, ఆ బంగారు గడ్డలు చూసి మైఖేల్ నోట మాట రాలేదు. అతడి ఆనందానికి అవధులు లేవు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
ఫ్రాన్స్ సహజ వనరుల చట్టాల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి తవ్వకాలు లేదా వెలికితీత పనులు చేపట్టరాదని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. పర్యావరణంపై ప్రభావం, చట్టపరమైన చిక్కులు లాంటివి ఏవి రాకుండా పూర్తీస్థాయి సమీక్ష చేసిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో మైఖేల్ ఒక్కసారిగా నిరాశ చెందాడు. కాగా, ప్రస్తుతం ఆ వ్యవసాయ భూమిలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరగట్లేదు. దాన్ని సీల్ వేసి ఉంచారు ప్రభుత్వ అధికారులు. ఫ్రాన్స్‌లోని ప్రైవేటు ఆస్తుల్లో ఎలాంటి సహజ వనురులు లభ్యమైనప్పటికీ.. దానిపై పూర్తి హక్కు ప్రభుత్వానికే ఉంటుంది.




