Viral Video: ఎటుచూసినా బస్సులో ఎవరూ కనిపించలేదు.. తీరా సీసీటీవీ చూడగా డ్రైవర్ గుండె గుభేల్
దెయ్యాలు, ఆత్మల కథలు మాంచి ఫాంటసీగా ఉంటాయి. ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి కథ ఒకటి తీసుకోచ్చేశాం. ఈ ఘటన నెదర్లాండ్స్‌లో చోటు చేసుకుంది. ఓ ఖాళీ బస్సులో డ్రైవర్‌కి ఏం కనిపించిందంటే.. ఆ వివరాలు

ట్రిప్పులు పూర్తయ్యాయి. అలాగే డ్యూటీ కూడా ముగిసింది. బస్సును బస్టాండ్‌లో పార్క్ చేశాడు. ఆఖరికి ఆ రోజు వచ్చిన కలెక్షన్ మొత్తం కౌంట్ చేసి.. బస్సులోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఆఫ్ చేయాలని చూశాడు. అంతే.! ఆ ఫుటేజ్‌లో కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు గుండె ఆగినంత పనైంది. బస్సులో ఎవరూ కనిపించకపోయినా.. సీసీటీవీలో మాత్రం ఓ ఆకారం ఎంచక్కా కూర్చుని ఉన్నట్టు చూపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రొమైకో న్యూవ్లాండ్ అనే వ్యక్తి RET, నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో ఉన్న ఒక ప్రధాన ప్రజా రవాణా సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బస్టాండ్‌లో పార్క్ చేస్తుండగా.. అతడికి బస్సు సీసీటీవీలో ఓ వింత ఆకారం కనిపించింది. బస్సు అంతా ఖాళీగా ఉన్నప్పటికీ.. ఆ ఆకారం మాత్రం ఓ సీటులో ఎంచక్కా కూర్చుని సేద తీరుతున్నట్టు అతడు సీసీటీవీ ఫుటేజ్‌లో చూశాడు. ఇదే విషయాన్ని అతడి తోటి ఉద్యోగితో పంచుకున్నాడు.
కెమెరాలో కనిపించిన ఆకారం స్పష్టంగా లేకపోయినా.. ఆ ఆకారం అచ్చం మనిషి మాదిరిగా కనిపించిందని.. రెండు చేతులు ఒడిలో పెట్టుకుని నిద్రపోతున్నట్టుగా ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే తలపై ఓ టోపీ కూడా ఉన్నట్టు తెలిపాడు. దాని ముఖం మాత్రం క్లారిటీగా లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అది చాలా భయానకంగా ఉందని’ ఒకరంటే.. ‘కచ్చితంగా ఆత్మ అయ్యి ఉంటుందని’ మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ చూసేయండి.
View this post on Instagram




