Viral Video: పాడుబడ్డ బొగ్గు గనిలో అదో మాదిరి నల్లటి ఆకారం.. దగ్గరకు వెళ్లి చూడగా
పాడుబడ్డ గనిని అన్వేషించేందుకు బయల్దేరారు ఓ వ్యక్తి, ఇద్దరు స్నేహితులు. వారికి ఆ గుహ ముఖద్వారం దగ్గరే వింత శబ్దాలు, అదో మాదిరి శబ్దాలు వినిపించసాగాయి. కొంచెం భయం భయంగానే ఏంటని చూడగా.. దెబ్బకు కనిపించిన నల్లటి ఆకారానికి అక్కడ నుంచి పరుగు పెట్టారు.

విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు.. నేచర్ ఎంజాయ్ చేసేందుకు చాలామంది హైకింగ్‌కు వెళ్తుంటారు. ఇంకొందరైతే పురాతన.. అలాగే పాడుబడ్డ బిల్డింగ్‌లు, గనుల్లో ఏముంటాయా అని రీసెర్చ్ చేస్తుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా తన స్నేహితులతో నేచర్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాడుబడ్డ గనుల దగ్గరకు వెళ్లాడు. ఇక అక్కడ అతడికి విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి అమెరికాలోని పాడుబడిన బొగ్గు గనులను అన్వేషించడానికి బయల్దేరాడు. సరిగ్గా ఆ గని ప్రవేశద్వారం దగ్గరకు రాగానే.. లోపల నుంచి భయంకరమైన, విచిత్ర శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఏమయ్యి ఉంటుందా అని కెమెరా ఆన్ చేసి రికార్డు చేయగా.. కొన్ని నిమిషాలకు ఆ గుహలో నల్లటి ఆకారం కనిపించింది. గగుర్పాటుకు గురిచేసే ఆ ఆకారాన్ని చూడగానే అక్కడ నుంచి పరుగులు పెట్టాడు సదరు వ్యక్తి. వీలైనంత వేగంగా అక్కడ నుంచి పారిపోయాడు. లేట్ ఎందుకు ఆ వీడియో మీరూ చూసేయండి.
View this post on Instagram




