తల్లి కోసం పేర్చిన చితిపై పడుకున్న కొడుకు! ఎందుకో తెలిస్తే.. థూ అని ఉమ్మేస్తారు!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన తల్లి అంత్యక్రియల సమయంలో, ఆమె వెండి కంకణం కోసం ఇద్దరు కుమారులు గొడవపడ్డారు. ఒక కొడుకు తల్లి చితిపై పడుకుని, కంకణం ఇవ్వకపోతే అంత్యక్రియలు జరగనివ్వనని పట్టుబట్టాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మానవత్వం సిగ్గుపడేలా ఒక ఘటన చోటు చేసుకుంది. తల్లి శవం ఎదురుగా పెట్టుకొని, ఆమె కోసం పేర్చిన చితిపై కన్నకొడుకు పడుకున్నాడు. పైగా తన సోదరుడితో గొడవకు దిగాడు. అలా ఎందుకు చేశాడో తెలియాలంటే.. పూర్తి స్టోరీ చదవాల్సిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో షాపురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లీలా కా బాస్ గ్రామంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె అంత్య క్రియల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె మృతదేహాన్ని ఊరేగింపుగా చితి వద్దకు కూడా తీసుకొచ్చారు. ఇంతలో ఆమె ఇద్దరు కుమారులు గొడవకు దిగారు.
తమ తల్లి చేతికి ఉన్న వెండి కంకణం తనకు కావాలంటే తనకు కావాలంటూ ఇద్దరు పొట్లాడుకున్నారు. ఇంతలో ఓ కుమారుడు వెండి కంకణం కోసం ఏకంగా తల్లి కోసం పేర్చిన చితిపైనే పడుకున్నాడు. అది ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేచేది లేదని, తల్లికి అంత్యక్రియలు కూడా జరగనివ్వనంటూ అలాగే పడుకుండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వయసొచ్చినా.. డబ్బుపై ఆశ చావాలేదా? తల్లి చనిపోయిందనే బాధ లేదు? ఛీ మరసలు కొడుకులేనా అంటూ మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
