AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పట్టాలపై చిక్కుకున్న కుక్కపిల్లను ప్రాణాలకు తెగించి కాపాడాడు.. సెకన్ లేటైనా అంతే సంగతి..

ప్రమాదం ఎప్పుడు.. ఎటు వైపు నుంచి వస్తుందో చెప్పడం కష్టం. అడుకుంటూ వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు.

Viral Video: పట్టాలపై చిక్కుకున్న కుక్కపిల్లను ప్రాణాలకు తెగించి కాపాడాడు.. సెకన్ లేటైనా అంతే సంగతి..
Viral
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2022 | 1:09 PM

Share

ప్రమాదం ఎప్పుడు.. ఎటు వైపు నుంచి వస్తుందో చెప్పడం కష్టం. అడుకుంటూ వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. దీంతో ప్రమాదంలో ఉన్నవారిని కొందరు తమ ప్రాణాలకు తెగించి కాపాడుతుంటారు. కొన్నిసార్లు ఇతరులను కాపాడతూ తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కానీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఎదురుగా వేగంగా వస్తున్న రైలును కూడా లెక్కచేయకుండా వెళ్లి ఓ కుక్క పిల్ల ప్రాణాలను కాపాడాడు ఓ వ్యక్తి.. పట్టాలపై ఇరుక్కున్న కుక్క పిల్లను చూసి మానవత్వంతో కుక్క పిల్లలను కాపాడాడు. ఈ ఘటనలో ఒక్క క్షణం ఆలస్యమైన కుక్కపిల్లతోపాటు.. అతను కూడా చనిపోయేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో.. ఓ కుక్కపిల్ల అనుకోకుండా పట్టాల పై చిక్కుకుంది. ఎదురుగా రైలు.. పారిపోవడానికి వీలు లేకుండా ఆ కుక్కపిల్లకు కట్టిన తాడు పట్టాలలో ఇరుక్కోవడంతో అక్కడే ఉండిపోయింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని గమనించి ఎదురుగా రైలు వస్తున్న లేక్కచేయకుండా వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలకు తెగించి మరి అ కుక్కను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్షణం ఆలస్యమైతే రెండు ప్రాణాలు పోయేవి అని..అతడి ధైర్యానికి హాట్యాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..

Follow Us