పాము మీ కళ్ల ముందు కనిపిస్తే ఏం చేస్తారు.. బాబోయ్ అని పరుగులు తీస్తారు. ధైర్య వంతులైతే పాము జోలికి వెళ్లకుండా కొంత దూరం నుంచి వెళ్తారు. ఇంకొందరు భయంతో కర్ర తీసుకుని వాటిపై అటాక్ చేస్తారు. మరి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలాడటం ఎప్పుడైనా చూశారా? పాములను రెచ్చగొట్టి కాటు వేయించుకోవడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూడండి.
మనం పాములను పట్టేవాళ్లను, పాములను ఆడించేవాళ్లను చూసే ఉంటాం. వారు పాములతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం పాముల కంటే డేంజర్‌లా ఉన్నాడు. అవును మరి. ఓ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాల మధ్యకు వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా.. వాటిని రెచ్చగొడుతూ తన తలపై కాటు వేయించుకున్నాడు. వింత వింత గా ప్రవర్తిస్తూ ఆ పాములను కోపం తెప్పించాడు. అయితే, కాసేపటి తరువాత ఆ పాముల్లో కూడా మార్పు వచ్చింది. అతను ఏం చేసినా అవి పెద్దగా పట్టించుకోలేదు.
అతను తన రెండు చేతులతో రెండు పాములను పట్టుకుని తన కళ్లతో వాటి కళ్లలోకి చూశాడు. మరోవైపు.. కింద ఉన్న మరో పాము దగ్గరకు వచ్చి దానికి ముద్దు పెట్టాడు. ఆపై లేచి పాములకు నమస్కరించాడు. ఈ భయానక, ఆశ్చర్యకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసి నెటజిన్లు అవాక్కవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..