Chimpanzee Emotional video: కోట్లు పెట్టినా దొరకని ప్రేమ.. పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్న చింప్‌.

Chimpanzee Emotional video: కోట్లు పెట్టినా దొరకని ప్రేమ.. పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్న చింప్‌.

Anil kumar poka

|

Updated on: Jun 23, 2023 | 9:47 AM

తల్లి-బిడ్డల ప్రేమ, సోదరుల మధ్య ప్రేమ, మిత్రుల మధ్య ప్రేమ చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే ఉంటుంది. మనుషి, జంతువుల మధ్య అంతకుమించిన ప్రేమ ఉంటుంది. అది ఎంత గాఢంగా ఉంటుందంటే.. కొన్ని కోట్లు పెట్టినా.. అలాంటి బంధం, సాన్నిహిత్యం, ప్రేమ, ఆప్యాయత లభించనంత.

తాజాగా ఓ వ్యక్తి, చింపాంజి పిల్లకు సంబంధించిన క్యూట్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనను సంరక్షించిన వ్యక్తిని ఓ చింపాంజిని చాలా కాలం తరువాత కలుస్తుంది. అతన్ని దూరం నుంచే గమనించిన చింపాంజి పిల్ల.. ఎంతో ప్రేమతో, అప్యాయతతో చెంగు చెంగున ఎగురుతూ, అరుస్తూ పరుగెత్తుకుంటూ వస్తుంది. మరోవైపు అతను సైతం ప్రేమగా తన చేతులు చాపి.. దానిని హత్తుకునేందుకు మోకాళ్లపై కూర్చుని పిలుస్తాడు. చింపాంజి పిల్ల అతని దగ్గరకు రాగానే.. వెంటనే తన రెండు చేతలుతో గట్టిగా కౌగిలించుకుంటే.. ఆ వ్యక్తి కూడా చింపాంజికి హత్తకుని, ముద్దు పెట్టుకుంటూ.. కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య ప్రేమకు, బాండింగ్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనుషులకంటే.. జంతువుల ప్రేమ స్వచ్ఛమైనదని, అవి ఎన్నటికీ మనలను మర్చిపోవని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!