First Night Banner: ఇదేం వింత పోకడ.. ఫస్ట్ నైట్‌కి విషెస్ చెబుతూ ఫ్రెండ్స్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు..

First Night Banner: ఇదేం వింత పోకడ.. ఫస్ట్ నైట్‌కి విషెస్ చెబుతూ ఫ్రెండ్స్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు..

Anil kumar poka

|

Updated on: Jun 23, 2023 | 8:32 AM

సాధారణంగా రాజకీయనేతలకు సినిమా రిలీజ్‌ సమయంలో అభిమాన హీరోలకు బ్యానర్లు కట్టడం చూస్తాం. ఇటీవల పెళ్ళిళ్ళకు, కల్చరల్ ఫంక్షన్లకు, కూడా పెద్ద పెద్ద బ్యానర్లు పెడుతున్నారు. స్నేహితుడి పెళ్లి అని, పుట్టిన రోజు అని సందర్భాన్ని బట్టి ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు.

ఓ వ్యక్తికి అతడి ఫ్రెండ్స్ ఊహించని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏకంగా శోభనానికి విషెస్ చెబుతూ బ్యానర్లు కట్టారు. గ్రామమంతా ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. వినడానికి కొత్తగా, చెత్తగా ఉన్న ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరులో ఓ యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. అతడు భార్యతో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి హనీమూన్‌కు సిద్ధమయ్యాడు. అయితే అతని స్నేహితులు వినూత్నంగా ఆలోచిస్తూ ఫస్ట్‎నైట్ కోసం బ్యానర్లు ఏర్పాటు చేశారు. “రాత్రంతా పోరాడి గెలువు మిత్రమా..” అంటూ విష్ చేశారు. అంతే కాకుండా రాత్రి 12 గంటలకు ముహూర్తం అని కూడా రాశారు. ప్రస్తుతం ఆ బ్యానర్ల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్నేహితులు చేసిన కొంటె పనిని తిడుతుంటే..మరికొందరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!