Viral Video: నీ ధైర్యానికి సలామ్ సామీ.. సింహాలతో దోస్తీ అంటే అట్లుంటది మరి..!
Viral Video: అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉన్నప్పటికీ.. సింహానికి ఉండే గుర్తింపే వేరు. క్రూర మృగాలలో సింహాన్ని మించింది లేదు. దాని శక్తి ముందు..
Viral Video: అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉన్నప్పటికీ.. సింహానికి ఉండే గుర్తింపే వేరు. క్రూర మృగాలలో సింహాన్ని మించింది లేదు. దాని శక్తి ముందు.. అడవిలోని మిగతా జంతువులన్నీ బలాదూర్ అని చెప్పాలి. అది గర్జిస్తే చాటు.. మొత్తం అడవి షేక్ అవుతుంది. దాని కంట మరేదైనా జంతువు పడితే చాటు.. ఆ రోజే దానికి చివరి రోజు అవుతుందనడం ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి సింహాల వద్దకు వెళ్లమంటే ఏవరైనా వెళ్తారా? సింహం బోనులో ఉంటేనే దగ్గరికి వెళ్లి చూడటానికి జడుసుకుంటారు. అలాంటిది వాటి దగ్గరికి వెళ్లి, వాటితో ఆటలాడటం అంటే మామూలు విషయమా!. కానీ, ఓ వ్యక్తి సింహాలు తన తోబుట్టువుల్లా.. తన స్నేహితుల్లా ఫీలువుతున్నాడు. ఫీల్ అవడమే కాదండోయ్.. వాటితో సరదాగా ఆడుకుంటున్నాడు. అవేవో బొమ్మలన్నట్లుగా వాటితో సయ్యాటలాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సింహాలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అతను అడవిలో పరుగెత్తుతుండగా.. సింహాలు అతని వెంట పరుగెత్తుకుంటూ వచ్చి అతనిపై వాలిపోతున్నాయి. అతన్ని స్నేహితుడిగా భావించాయో ఏమో గానీ.. అతనితో సరదాగా ఆడుకుంటున్నాయి సింహాలు. దొంగా పోలీసు మాదిరిగా.. సింహాలు, ఆ వ్యక్తి రన్నింగ్ పోటీ పెట్టుకున్నారు. చివరకు సింహాలు అతన్ని పట్టుకుని, ఆడుకున్నాయి. అతన్ని నాలుకతో తడుముతూ తమ ప్రేమను చూపించాయి సింహాలు. అయితే, సింహాలో అతను సరదాగా ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సింహాలతో స్నేహం అదుర్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 5.75 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram
Also read: