Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మనిషా.. దేవుడా.. శని-ఆదివారాలు మాత్రమే కాటేస్తోన్న పాము.. నెలన్నర వ్యవధిలోనే 6సార్లు..

చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్యులు అతడిని ఇంటికి పంపించారు. ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే తనను పాము కాటువేస్తున్నట్టుగా ఆ యువకుడు చెబుతున్నాడు. ప్రతిసారీ అతని ఒంటిపై పాము కాటువేసిన కొత్త గుర్తులు ఉంటున్నాయని వైద్యులు కూడా నిర్ధారించారు. ప్రతి సందర్భంలోనూ అతనికి యాంటీ స్నేక్ వెనమ్ ఎమర్జెన్సీ మందులు ఇస్తున్నామని చెప్పారు.

వీడు మనిషా.. దేవుడా.. శని-ఆదివారాలు మాత్రమే కాటేస్తోన్న పాము.. నెలన్నర వ్యవధిలోనే 6సార్లు..
Snake Bites
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2024 | 9:18 PM

నెలన్నర వ్యవధిలో ఓ యువకుడిని ఆరుసార్లు పాము కాటు వేసింది. అదృష్టవశాత్తు ప్రతిసారీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..పగబట్టిన పాము అతన్ని వెంటాడి వెటాడి మరీ రెండు ప్రత్యేక రోజుల్లోనే కాటువేస్తోంది. పాము నుంచి తప్పించుకునేందుకు అతడు ఊరు మారినప్పటికీ పాము కాటు నుంచి తప్పించుకోలేకపోయాడు. పొరుగురికి వెళ్లి మరీ పాము కాటేసింది. అలా మొత్తం ఆరుసార్లు పాము అతన్ని కాటువేసి చంపాలనుకుంది. పాము కాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి తెలిసి వైద్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలోని ఫతేపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నెలన్నర వ్యవధిలో ఓ యువకుడిని ఆరుసార్లు పాము కాటు వేసింది. చికిత్స అనంతరం యువకుడు కోలుకున్నాడు. భయంతో ఆ యువకుడు ఇల్లు వదిలి తన మామ ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అయితే పాము మళ్లీ కాటేసింది. దీంతో యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో చికిత్స చేస్తున్న వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే వికాస్ దూబే నెలన్నర వ్యవధిలో ఐదుసార్లు పాము కాటుకు గురయ్యాడు. జూన్ 2 న రాత్రి 9 గంటలకు మంచం నుండి లేస్తూ అడుగు కిందపెట్టగానే మొదటిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతని కుటుంబం అతనిని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లింది. రెండు రోజులు అక్కడే అడ్మిట్‌ అయ్యాడు. చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి వచ్చాడు.

అయితే, ఇది ఒక సాధారణ సంఘటన అని కుటుంబ సభ్యులు భావించారు. ఆ తరువాత, అతను జూన్ 10న రాత్రి మళ్లీ పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతని కుటుంబం అతన్ని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేర్చింది. చికిత్స తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు. అతని మనసులో పాముల భయం పట్టుకుంది. దాంతో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఏడు రోజుల తరువాత జూన్ 17 న ఒక పాము అతన్ని ఇంట్లో మళ్లీ కాటేసింది. దాంతో అతని పరిస్థితి బాగా క్షీణించింది. ఆ తర్వాత అదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నాల్గవ సారి ఏడు రోజులు కూడా గడవలేదు. మూడు రోజుల తరువాతే పాము మళ్లీ కాటేసింది. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ఈసారి కూడా చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. బంధువులు, డాక్టర్ కొద్దిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ సలహా మేరకు రాధానగర్‌లోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు.

ఆ తర్వాత అతడిని కుటుంబ సభ్యులు అదే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అతను మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలోని తన మామ సంతోష్ దూబే ఇంటికి వెళ్లాడు. అయితే జూలై 6వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా పాము ఆరోసారి కాటు వేసింది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గతంలో చికిత్స చేసిన ఆసుపత్రిలోనే చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్యులు అతడిని ఇంటికి పంపించారు. ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే తనను పాము కాటువేస్తున్నట్టుగా ఆ యువకుడు చెబుతున్నాడు. ప్రతిసారీ అతని ఒంటిపై పాము కాటువేసిన కొత్త గుర్తులు ఉంటున్నాయని వైద్యులు కూడా నిర్ధారించారు. ప్రతి సందర్భంలోనూ అతనికి యాంటీ స్నేక్ వెనమ్ ఎమర్జెన్సీ మందులు ఇస్తున్నామని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..