Viral Video: మానవత్వం అంటే ఇదే.. కోతి దాహం తీర్చిన యువకుడు.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
అటవీ ప్రాంతాల్లో మూగ జీవాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో జంతువులు, పక్షుల కోసం మైదాన ప్రాంతాల్లో నీటి కుండలను ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.
Man giving water to monkey: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ నమోదుకాని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమదవుతున్నాయి. వేడికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎండ వేడికి మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్ధం చేసుకోండి.. మనకు దాహం వేస్తే.. నీటిని తాగుతాం.. కానీ జంతువులు అలా కాదు.. అటవీ ప్రాంతాల్లో మూగ జీవాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో జంతువులు, పక్షుల కోసం మైదాన ప్రాంతాల్లో నీటి కుండలను ఏర్పాటు చేయాలని.. లేకపోతే డబ్బాల్లో అయినా నీటిని ఉంచాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ యువకుడు వానరానికి నీరు తాపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది జంతువుల పట్ల ప్రేమ ఆప్యాయతకు, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వీడియోలో దాహంతో ఉన్న కోతికి ఓ యువకుడు నీళ్లు పోస్తుండగా.. ఆ కోతి కూడా ఎంతో ప్రేమతో తాగుతూ కనిపించింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి.. మానవత్వం అంటే ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో పాతదే అయినా మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో..
Being kind is better than being correct? pic.twitter.com/oqXxRzAMgF
— Susanta Nanda IFS (@susantananda3) June 10, 2020
ఈ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు దీన్నే మానవత్వం అంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకోవడంతోపాటు మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: