Viral Video: అడ్డంగా బుక్ అయ్యాడు..జర జాగ్రత్త!..లేకుంటే మీరు ఇలానే..
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్యారీ వాలియా అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఓ వీడియో అందరిన్నీ షాక్‌కి గురి చేసింది. "చివరి వరకు ఈ వీడియోను చూస్తే మీరు షాక్ అవుతారు" అనే క్యాప్షన్‌తో పెట్టి షేర్ చేశాడు.
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్యారీ వాలియా అనే వ్యక్తి పోస్ట్ చేసిన ఓ వీడియో అందరిన్నీ షాక్‌కి గురి చేసింది. “చివరి వరకు ఈ వీడియోను చూస్తే మీరు షాక్ అవుతారు” అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశాడు. వీడియో చూసిన తర్వాత నిజంగా అందరూ అవాక్కయారు. మొదట వీడియో చూస్తే రొటీన్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ అందరీన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ బిచ్చగాడు కర్రలు పట్టుకొని అందర్నీ డబ్బులు ఆడుకుంటుండగా చివరికి ఆ వ్యక్తి వికలాంగుడు కాదని ట్విస్ట్ తెలుస్తుంది. డబ్బు సంపాదించడం కోసం కష్టపడి పని చేయడం కంటే ఇతరులను మోసం చేయడం అనే అంశం ఈ వీడియోలో హైలైట్ చేస్తుందని చెప్పాలి.
ఓ వ్యక్తి రెండు కర్రలు పట్టుకొని తాను వికలాంగుడిని అని తన భార్యతో కలిసి డబ్బులు ఆడుకుంటుండగా స్థానికులు అతడు వికలాంగుడు కాదని గుర్తించారు. దీంతో అతన్ని ఆపి నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో అతడు తప్పు జరిగిందని, మరోసారి ఇలా చేయనని స్థానికులను వేడుకున్నారు. వారిని స్థానికులు వదలకుండా అక్కడి నుంచి తరమికొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇలా కాళ్లు, చేతులు బాగానే ఉన్నా మోసం చేసి అడుకోవడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదిగో:
बहुत झटका लगेगा ये वीडियो अंत तक देखना 😳pic.twitter.com/7AqzQgWIY1
— Gurpreet Garry Walia (@garrywalia_) October 7, 2024
ఈ మధ్య ఎక్స్‌లో ఇలాంటి వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సమాజంలో జరుగుతున్న మోసలపైన కొందరు అవగాహన కలిగి ఉండాలని కొందరు ఇలా వీడియోలను పంచుకుంటున్నారు. ఆ వీడియోలు పోస్ట్ చేసిన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.