AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెండు నాగుపాముల మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందో తెలుసా..

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వీడియోలను నెటిజన్లు ఇష్టపడటంతోపాటు షేర్ చేసి వైరల్‌గా మారుస్తుంటారు.

Viral Video: రెండు నాగుపాముల మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందో తెలుసా..
King Cobra Fight
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2024 | 2:07 PM

Share

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.. ఇలాంటి వీడియోలను నెటిజన్లు ఇష్టపడటంతోపాటు షేర్ చేసి వైరల్‌గా మారుస్తుంటారు. వీటిలో ముఖ్యంగా పాముల వీడియోలు నెటిజన్లలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పాముల వీడియోలు బయటకు రాగానే.. వాటిని చూడాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పాముల పోరాటానికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా.. రెండు కింగ్ కోబ్రాలు (నాగు పాము) కు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.. ఈ వీడియోలో రెండు నాగుపాములు భీకరంగా పోట్లాడుకుంటున్నాయి.. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

మనం ఇంటర్నెట్‌లో చాలా కోబ్రా ఫైట్‌లను చూశాం.. కానీ ఇది చాలా భిన్నమైనది. వీడియో ప్రారంభంలో రెండు ప్రత్యర్థి నాగుపాములు.. ఒకదానికొకటి చాలా దూకుడుగా ఉన్నాయి.. తర్వాత అవి పెనవేసుకుని పోట్లాడుకోవడం ప్రారంభమవుతుంది.. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. చుట్టుకుని పోట్లాడుకుంటున్న పాములు.. ఒక్కసారిగా శాంతించాయి.

వీడియో చూడండి..

దీన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపించింది.. భీకరంగా పొట్లాడుకున్న పాములు.. ఒక్కసారిగా కోపాన్ని వీడాయి.. పాములు భీకరంగా పొట్లాడుకుంటూ రెండూ పెనవేసుకున్నాయి.. ఆ తర్వాత వెంటనే ఆగిపోయాయి.. ఈ క్రమంలో రెండు పాములు ఒకదానికొకటి దూరంగా వెళ్లాపోయాయి..

ఈ పాములు ఎందుకు పోట్లాడుకుంటున్నాయో కూడా అర్థం కాలేదు.. ఈ పాములకు ఏమైంది?.. ఉన్నట్టుండి ఎందుకు గొడవ పడ్డాయి.. దూరంగా ఎందుకెళ్లాయి..? చివరకు గెలుపు ఎవరిది.. అంటూ నెటిజన్లు ఫన్నీ క్వశ్చన్లు వేస్తున్నారు. సాధారణంగా పాముల పేరు వింటేనే భయపడుతుంటాం.. ఈ పాముల పొట్లాట చూస్తే మరింత భయమవుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.