Viral: ఆల్చిప్పల డిష్ ఆర్డర్ పెడితే.. అనుకోని అదృష్టం కలిసొచ్చింది.. తింటూ ఉండగా..
ఆ ఫ్యామిలీ వెకెషన్ ఎంతో మెమరబుల్‌గా మారింది. వారు ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఓ అనుకోని గిఫ్ట్ కూడా వచ్చింది. ఈ ఘటన మిమ్మల్ని కూడా సర్‌ప్రైజ్ చేస్తుంది.

Trending: మీలో చాలామంది చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలు, నత్తలు ఇంకా రకరకాల మంసాలు తినే ఉంటారు. కానీ ఆల్చిప్పలతో చేసే వంటకాలు తిన్నవాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కొందరు ఈ డిష్‌ను చాలా ఇష్టంగా తింటారు. అమెరికా వంటి పాశ్చాత్త దేశాల్లో ఆల్చిప్పలకు మంచి డిమాండ్ ఉంటుంది. సూప్, ప్రైతో పాటు ఇతర కూరలతో పాటు కూడా ఆల్చిప్పలు కలిపి వండుతారు. కొందరు మొప్పులను తీసేవేసి కర్రీ వండుతారు. ఇంకొందరు ఆ మొప్పలు ఉంచేసి.. వంట చేసేస్తారు. తాజాగా అమెరికాలో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లి ఆల్చిప్పల డిష్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని చివర్లో కనిపించింది చూసి కంగుతిన్నారు. ఫిలడెల్ఫియా(Philadelphia) ప్రాంతంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో పనిచేస్తున్న స్కాట్ ఓవర్‌ల్యాండ్ అనే వ్యక్తి.. ఇటీవల తన కుటుంబంతో కలిసి డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఆపై దగ్గర్లోని సాల్ట్ ఎయిర్ అనే రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశారు. వారి మెనూలో ఆల్చిప్పలకు సంబంధించిన డిష్ కూడా ఉంది. సర్వ్ చేసిన అనంతరం ఆ డిష్ తింటూ ఉండగా.. చివర్లో వారికి ఒక ఆల్చిప్ప షెల్ ఓపెన్ చేయగా లోపల ఓ ఊదా రంగు ముత్యం ప్రత్యక్షమైంది. దీంతో ఆ వారంతా సర్‌ప్రైజ్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదు.
ఆ ముత్యాన్ని తిరిగి రెస్టారెంట్ వారికి ఇవ్వాలా, వద్దా అని తన భార్య ఆలోచించిదని.. చివరికి ఉంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఓవర్‌ల్యాండ్ తెలిపాడు. వెంటనే వారు ఫోన్‌లో గూగుల్ సెర్చ్ చేయగా.. ఆ ముత్యం 600 నుంచి 16,000 డాలర్ల మధ్య ఉంటుందని తేలింది. కాగా వారిచ్చిన ఆ డిష్ ఖరీదు కేవలం 14 డాలర్లు మాత్రమే. ఈ రకంగా చూస్తే ఆ ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టినట్లే. (Source)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.