Viral Video: పాతికేళ్ల పెళ్లి రోజునే అంతులేని విషాదం.. అంతా చూస్తుండగానే కుప్పకూలి..
కుటుంబ సభ్యులంతా.. సంతోషంగా చప్పట్లు కొడుతూ అతడిని ఎంకరేజ్ చేయసాగారు. ఎంతో ఆనందగా సాగుతున్న ఆ వేడుకల్లో ఉన్నట్లుండి విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరస్వత్ కుటుంబ సభ్యుల నవ్వులు, అల్లరితో సందడిగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ఏడుపులు, ఆర్తనాదాలతో నిండిపోయింది. కారణం.. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండి.. భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సరస్వత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ సంఘటన CCTVలో రికార్డైంది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఒక భార్యాభర్తలు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పెళ్లై పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఆ జంట కుటుంబ సభ్యుల మేరకు బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో సంతోషంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు హాజరైన కొందరు అమ్మాయిలు ఆ జంటతో కలిసి వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవరించింది. అప్పటి వరకు ఎగిరి గంతులేసిన ఆమె భర్త ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చెప్పుల వ్యాపారం చేసుకునే బిజినెస్‌మాన్ వాసిం సరస్వత్(50) దంపతులు తమ 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఫిలిబిత్ బైపాస్ రోడ్డులో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా సరస్వత్, తన భార్య ఫారాతో కలిసి డ్యాన్స్ చేయసాగాడు. కుటుంబ సభ్యులంతా.. సంతోషంగా చప్పట్లు కొడుతూ అతడిని ఎంకరేజ్ చేయసాగారు. ఎంతో ఆనందగా సాగుతున్న ఆ వేడుకల్లో ఉన్నట్లుండి విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరస్వత్ కుటుంబ సభ్యుల నవ్వులు, అల్లరితో సందడిగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ఏడుపులు, ఆర్తనాదాలతో నిండిపోయింది. కారణం.. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉండి.. భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న సరస్వత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ సంఘటన CCTVలో రికార్డైంది.
వీడియో ఇక్కడ చూడండి..
In UP’s Bareilly, Wasim and Farah dancing at a party to commemorate their 25th wedding anniversary were struck by tragedy after Wasim collapsed on stage and died. pic.twitter.com/WHideSl9EI
— Piyush Rai (@Benarasiyaa) April 3, 2025
ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. సరస్వత్‌ను లేపేందుకు ప్రయత్నించారు. ఆయనకు స్పృహ రాకపోవడంతో.. వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సరస్వత్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గుండెపోటు కారణంగా సరస్వత్ చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. పెళ్లి రోజు నాడే ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. సరస్వత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య స్కూల్ టీచర్‌గా పని చేస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..