ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని కోరుకున్న నీతా అంబానీ
పాదయాత్రలో అడుగడునా దైవనామస్మరణ చేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ శ్రీ ద్వారకాధీశుడు తన పట్ల దయతో ఉన్నాడని, ఆ దేవుడి తనకు బలాన్ని ఇచ్చాడని అనంత్ అంబానీ అన్నారు. అప్పుడే తానే ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని, ఇప్పుడు ఈ ప్రయాణం విజయవంతంగా ముగిసిందని చెప్పారు అనంత్. తన భార్య, తల్లి కూడా తనకు మద్ధతు ఇచ్చారని చెప్పాడు.

దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ద్వారకకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. జామ్‌నగర్ నుండి ద్వారకాధీష్ ఆలయం వరకు చేసిన పాదయాత్ర ఈరోజు పూర్తయింది. ఈరోజు రామ నవమి రోజున ఆయన ద్వారకాధీష్ ఆలయానికి చేరుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అనుకున్నట్లు ఆయన భార్య రాధికా మర్చంట్ తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకకు 170 కి.మీ. ఈ యాత్ర చేపట్టారు. కాగా, మార్చి 29న అనంత్ యాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో అడుగడునా దైవనామస్మరణ చేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ శ్రీ ద్వారకాధీశుడు తన పట్ల దయతో ఉన్నాడని, ఆ దేవుడి తనకు బలాన్ని ఇచ్చాడని అనంత్ అంబానీ అన్నారు. అప్పుడే తానే ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని, ఇప్పుడు ఈ ప్రయాణం విజయవంతంగా ముగిసిందని చెప్పారు అనంత్. తన భార్య, తల్లి కూడా తనకు మద్ధతు ఇచ్చారని చెప్పాడు. తన తండ్రిక ఇతన ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారని,తనను ఆశీర్వాదించారని అన్నాడు. తన అమ్మమ్మ, అమ్మమ్మ, అత్తగారు, మామగారు సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Devbhumi Dwarka, Gujarat | ‘Padyatra’ of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
Anant Ambani says, “I extend my best wishes to all on… pic.twitter.com/JhL6KGkqvQ
— ANI (@ANI) April 6, 2025
అనంత్ అంబానీ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ, ఒక తల్లిగా, తన చిన్న కుమారుడు అనంత్ ఈ దివ్య ద్వారకాధీశుడి వద్దకు పాదయాత్ర పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. గత 10 రోజులుగా అనంత్ పాదయాత్రలో పాల్గొన్న యువకులందరూ మన సంస్కృతిని వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు.. అనంత్‌కి బలాన్ని ప్రసాదించమని ద్వారకాధీశుడిని ప్రార్థిస్తున్నాను. అనంత్ అంబానీ 110 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..