Viral Video: ఐశ్వర్య రాయ్ పాటకు యువకుడి సూపర్బ్ డ్యాన్స్.. అమ్మాయిగా మారి అదరగొట్టాడు.. వీడియో వైరల్..
కానీ తాజాగా ఓ యువకుడు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పాటకు అదిరిపోయేలా స్టె్ప్పులేశాడు.. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు..
మ్యూజిక్ వినిపిస్తే కాలు కదపని వారుండరు. కొన్ని పాటలు వింటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ అంటూ సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా ఓ యువకుడు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ పాటకు అదిరిపోయేలా స్టె్ప్పులేశాడు.. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. అతడి డ్రెస్సింగ్ కూడా అమ్మాయిలాగే ఉండడం విశేషం.. ఈ భారతీయ కుర్రాడు అమెరికా వీధుల్లో అమ్మాయిలా డ్రెస్సింగ్ వేసి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చూపరులను కట్టిపడేస్తున్నాడు. అమ్మాయిలాగా స్కర్ట్, కుర్తా ధరించి స్టెప్పులతో అదరగొడుతున్నాడు. గతంలో ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఫేమస్ సాంగ్ బర్సో రే మేఘా.. మేఘా పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు..
మెరున్ కలర్ స్కర్ట్ ధరించి అమెరికా వీధుల్లో అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు.. అతని హావాభావాలు సైతం అమ్మాయిల మాదిరిగానే ఇస్తూ ఆకట్టుకున్నాడు. అతని డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని డ్యాన్స్ వీడియోస్ చూసిన నెటిజన్స్ అద్భుతంగా, సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram