Watch Video: అమ్మ బాబోయ్.. పగబట్టిన తేనెటీగలు.. అధికారిని వెంటాడి, వేటాడి కుట్టేశాయి..!

|

May 23, 2023 | 9:33 AM

తేనె తుట్టె కదపొద్దు అని అంటారు. ఎందుకంటే.. ఉత్తి పుణ్యానికి దాన్ని కదిలిస్తే.. ఆ తేనె తుట్టేపై ఉన్న తేనెటీగలు.. వెంటాడి వెంటాడి కుట్టి చంపుతాయి. ఎక్కడ దాక్కున్నా వెంబడించి మరీ కుట్టేస్తాయి. తేనెటీగలు కుట్టడం వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందకే తేనెటీగలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు.

Watch Video: అమ్మ బాబోయ్.. పగబట్టిన తేనెటీగలు.. అధికారిని వెంటాడి, వేటాడి కుట్టేశాయి..!
Bees Attack
Follow us on

తేనె తుట్టె కదపొద్దు అని అంటారు. ఎందుకంటే.. ఉత్తి పుణ్యానికి దాన్ని కదిలిస్తే.. ఆ తేనె తుట్టేపై ఉన్న తేనెటీగలు.. వెంటాడి వెంటాడి కుట్టి చంపుతాయి. ఎక్కడ దాక్కున్నా వెంబడించి మరీ కుట్టేస్తాయి. తేనెటీగలు కుట్టడం వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందకే తేనెటీగలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అయితే, తాజాగా ఓ అధికారిని రోడ్డుపై వెంటబడి మరీ కుట్టాయి తేనెటీగలు. వాటి దెబ్బకు అతను రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందినది. లాస్ ఏంజిల్స్‌లో ఓ అధికారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వందలాది తేనెటీగలు అతని వెంట పడ్డాయి. కుట్టడం మొదలు పెట్టాయి. అతను వాటిని అదిలించే ప్రయత్నం చేసినా.. అస్సలు తగ్గలేదు. కొంత దూరం వరకు అలాగే వేటాడుతూ, వెంటాడుతూ కుట్టిన చోట కుట్టకుండా కుట్టేశాయి. దాంతో లాభం అదిరిపోయిన అతను.. కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తేనిటీగలు మరింత రెచ్చిపోయి కుట్టడంతో అతను అక్కడికక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఈ దశ్యాలన్నీ డ్రోన్ కెమెరాలో రికార్డ్ అవగా.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియో(Courtesy: Fox11):

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..