AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంట్లో మంచంపై పడుకున్న వ్యక్తి.. ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత

ఉత్తరాఖండ్‌లోని ఓ ఇంట్లో తను పడుకున్న మంచంపైకి వచ్చిన భారీ కింగ్ కోబ్రాను ఒక వ్యక్తి అత్యంత శాంతంగా వీడియో తీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా మంచంపై నెమ్మదిగా కదులుతుండగా, ఆ వ్యక్తి భయపడకుండా దాన్ని కూల్‌గా గమనిస్తూ వీడియో తీస్తున్నాడు.

Viral Video: ఇంట్లో మంచంపై పడుకున్న వ్యక్తి.. ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత
King Cobra
Ram Naramaneni
|

Updated on: May 23, 2025 | 3:15 PM

Share

మాములుగా పాము ఆమడ దూరంలో కనిపిస్తేనే మనం పరుగు లఖించుకుంటాం. కానీ వీడెవడండీ బాబు.. తన పడుకున్న బెడ్‌పైకి కింగ్ కోబ్రా అదేనండీ రాచనాగు వచ్చి అటూ ఇటూ పాకుతున్నా పెద్దగా హైరానా పడలేదు. పైగా ఆ పాము కదిలికలను వీడియో కూడా తీశాడు. పాము అతని తలవైపు వచ్చినప్పుడు మాత్రమే అతను వెంటనే మంచం నుండి దూకి దూరంగా వచ్చాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగుచూసింది. అక్కడ కింగ్ కోబ్రా వంటి విషపూరిత పాములు వంటి జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి… 

వీడియోలో, ఒక వ్యక్తి తన పడుకున్న మంచం మీద నెమ్మదిగా కదులుతున్న భారీ కింగ్ కోబ్రాను చాలా కూల్‌గా రికార్డు చేస్తూ కనిపించాడు. భయపడి కదలకుండా.. వేగంగా తప్పించుకునే బదులు అతడు పాము కదలికను ఆసక్తిగా, రిలాక్స్‌గా చిత్రీకరించాడు.

కింగ్ కోబ్రాలు భారతదేశంలో ఉండే అతి పొడవైన విషపూరిత పాములు. విష స్వభావం ఉన్నప్పటికీ, పాము ఈ వ్యక్తికి హాని కలిగించలేదు. వాస్తావానికి కింగ్ కోబ్రాలు మనుషుల పట్ల దూకుడుగా వ్యవహరించవని స్నేక్  క్యాచర్స్ చెబుతున్నాయి. అవి సిగ్గు స్వభావాన్ని కలిగి ఉంటాయట. మనుషులతో ఘర్షణకు సాహసించవట. తమ ప్రాణాలకు హాని అని భావించినప్పుడే అవి కాటు వేస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.