AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!

మహారాష్ట్ర: ఫామ్‌హౌస్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడు కుక్కపై దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ప్రాణభయంతో వెనక్కి తగ్గకుండా ఆ కుక్క చిరుతను ఎదుర్కొంది. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటానికి సంబంధించిన దృశ్యాలు ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!
Leopard Vs Dog
Balaraju Goud
|

Updated on: Sep 08, 2026 | 6:57 PM

Share

మహారాష్ట్ర: ఫామ్‌హౌస్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడు కుక్కపై దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ప్రాణభయంతో వెనక్కి తగ్గకుండా ఆ కుక్క చిరుతను ఎదుర్కొంది. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటానికి సంబంధించిన దృశ్యాలు ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోమవారం (సెప్టెంబర్ 07) సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుతపులి ఫామ్‌హౌస్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న ‘రాకీ’ అనే పెంపుడు కుక్కపై ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని దాడితో రాకీ కాసేపు తడబడినా.. వెంటనే చిరుతను ఎదుర్కొంది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో చిరుతతో తీవ్రంగా పోరాడింది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. చిరుత తన పదునైన పంజాలతో రాకీపై దాడి చేస్తుండగా, రాకీ కూడా దానికి గట్టిగా ప్రతిఘటించింది. ఒక దశలో రాకీ చిరుత దవడను పట్టుకున్నట్లు కనిపించింది. ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్రంగా పెనుగులాట జరిగింది. చిరుత పలుమార్లు పంజాలతో దాడి చేసినప్పటికీ రాకీ వెనక్కి తగ్గలేదు.

చివరకు చిరుత అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో పోరాటం ముగిసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకా సఖారే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఫామ్‌హౌస్ విజయ్ పాటిల్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మాజీ ఎమ్మెల్యే రాజు పాటిల్ సోదరుడు. ఈ ఘటనలో రాకీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. చిరుతను ఎదుర్కొన్న తీరుపై స్థానికులు, సోషల్ మీడియా వినియోగదారులు రాకీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

మరోవైపు, ఫామ్‌హౌస్ పరిసరాల్లో చిరుత సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులకు సూచిస్తున్నారు. మానవ నివాసాలకు సమీపంలో వన్యప్రాణుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us